English | Telugu

ఎవరింట్లోకి తొంగి చూడొద్దు ..బుద్దిగా మీ పెళ్లాలతో కాపురం చేసుకోండి


ఈ వారం జబర్దస్త్ షో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మెసేజ్ ఓరియెంటెడ్ గా సాగింది. అందులోనూ ఇమ్ము వర్ష స్కిట్ లో ఆ మెసేజ్ ఇవ్వడం కనిపించింది. వర్షతో పాటు మరో ఇద్దరు లేడీ కమెడియన్స్ అలాగే ఇమ్ము, పండు, దుర్గారావు కలిసి ఈ స్కిట్ లో చేశారు. ఐతే దుర్గారావు వర్షను పెళ్లి చేసుకుంటాడు. ఇక వర్ష సిస్టర్స్ ని పండు, ఇమ్ము పెళ్లి చేసుకుంటారు. వాళ్లకు వాళ్ళ భార్యలు నచ్చరు. అలా ముగ్గురూ కూడా వర్ష మీదనే కన్నేశారు. ఐతే ఏమీ తెలియని దుర్గారావుకు వర్ష లాంటి మంచి భార్య వచ్చేసరికి పండు, ఇమ్ము కుళ్లిపోయి దుర్గారావును చంపేసి వర్షను పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఐతే ఇమ్ము మూడు విషయం కలిపినా బాటిల్స్ తెచ్చి మిగతా ఇద్దరికీ ఇస్తాడు. అలా ముగ్గురు తాగేసాక పండు, ఇమ్ము కూడా గొంతు పట్టుకుంటారు. ఐతే వర్ష ఎవరికీ తెలీకుండా పండుని, ఇమ్ముని వేసేయాలని వాళ్ళ బాటిల్స్ విషం కలిపేసింది. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరూ షాకయ్యారు.

ఇక ఇమ్ము, వర్ష కాదు ఇప్పటి నుంచి దుర్గారావు-వర్షా మాత్రమే అని చెప్పింది. రష్మీ కూడా గట్టిగ అరుస్తూ "ఇమ్ము వర్ష వద్దు..దుర్గారావు - వర్ష ముద్దు" అంది. ఇక సొసైటీకి మెసేజ్ ఇచ్చింది. ఇప్పటికైనా మీ పెళ్లాలతో బుద్దిగా కాపురం చేసుకోండి. ఎవరింట్లోకి తొంగి చూడొద్దు అంటూ మెసేజ్ ఇచ్చింది. తర్వాత శివాజీ ఐతే "ఆమ్మో మెసేజ" అన్నాడు. వెనక నుంచి ఇమ్ము "ఆ మెసేజ్ కూడా ఇది ఇస్తోంది" అంటూ వర్ష మీద కామెంట్ చేసాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.