English | Telugu

నాలో టాలెంట్ ని గుర్తించింది ఎస్పీ బాలు గారే..ఆయనే నాకు అవకాశాలు ఇచ్చారు


ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో బ్రహ్మానందాన్ని ఈ షోకి గెస్ట్ గా పిలిచారు. ఇక బ్రహ్మానందం రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ థమన్, కార్తీక్, గీత, శ్రీరామ చంద్ర అలాగే సమీరా భరద్వాజ్ చెప్పుకొచ్చారు. ఇక కంటెస్టెంట్స్ కి తన స్టైల్ లో ఆల్ ది బెస్ట్ చెప్పారు. కంటెస్టెంట్ ధీరజ్ వచ్చి ఎస్పీ బాలు గారి బ్రెత్ లెస్ సాంగ్ "మాటే రాని" సాంగ్ పాడాడు. అలాగే ధీరజ్ ఆయన గురించి షేర్ చేసుకున్నాడు.

"నా మ్యూజికల్ ఐడల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంత పెద్ద వేదిక మీద నేను ఇలా నిలబడి మన లెజెండరీ జడ్జెస్ ముందు పాడుతున్నాను అంటే దానికి కారణం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు. నేను సింగర్ అవుతాను అన్న ఐడియా మా అమ్మానాన్నకు లేదు. కానీ ఎస్పీబి సర్ నన్ను గుర్తించారు. ఆయనే పాడడానికి అవకాశాలు ఇచ్చారు నాకు. ఆయన షోలో పాడే మంచి ఛాన్స్ ఇచ్చారు. అలాగే పాట అంటే ఏమిటి పాట యొక్క వేల్యూ ఏమిటి ఒక పాటలో సాహిత్యానికి ఉండే ఇంపార్టెన్స్ గురించి నాకు ఆయన చెప్పేవారు. మనకు ఉన్న టాలెంట్ ఎప్పుడూ ఎదుటి వాళ్లకు ఉపయోగపడాలి దాని కోసం మనం ఎంతో సాధన చేసి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు నాకు చెప్పారు" అంటూ ధీరజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పాటకు బ్రహ్మానందం ఫిదా ఇపోయారు అలాగే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ అనౌన్స్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.