English | Telugu

షాకింగ్‌.. క‌త్తిపై న‌య‌ని వేలి ముద్ర‌లు.. ఏం జ‌రుగుతోంది?

ఆషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టిస్తోన్న‌ సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. బుల్లితెర‌పై గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సారం అవుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. జ‌ర‌గ‌బోయేది ముందే పసిగ‌ట్టే వ‌రం వున్న ఓ యువ‌తి క‌థ‌గా ఈ సీరియ‌ల్‌ని మ‌లిచిన తీరు మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో, ట్విస్ట్ ల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్‌లోని ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణుప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నారెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలో విశాల్, న‌య‌ని త‌వ్వి తీసిన పెట్టెలో ఓ క‌త్తి ల‌భిస్తుంది. ఆ క‌త్తిపై వున్న వేలి ముద్ర‌లు ఎవ‌రివో తేల్చాల‌ని ఎస్సై త‌న టీమ్‌తో తిలోత్త‌మ ఇంటికి వ‌స్తాడు. వీరితో పాటు విశాల్, న‌య‌ని కూడా వ‌స్తారు. అక్క‌డ ఒక్కొక్క‌రి వేలి ముద్ర‌లు తీసుకుంటుంటారు. ఎవ‌రి వేలి ముద్ర‌లు మ్యాచ్ కావు.. చివ‌రికి విశాల్‌, తిలోత్త‌మ, న‌య‌ని మిగులుతారు. బాబు గారు మ‌గ వాళ్ల‌లో మీరు, ఆడ‌వాళ్లలో నేను, అత్త‌మ్మ మాత్ర‌మే మిగిలామ‌ని చెబుతుంది న‌య‌ని.

స‌రే ముందు నేనే ఇస్తాన‌ని వెళ్లి వేలి ముద్ర‌లు ఇస్తాడు విశాల్‌.. అత‌నివి మ్యాచ్ కావు.. ఆ త‌రువాత తిలోత్త‌మ వంతు వ‌స్తుంది. దీంతో తిలోత్త‌మ‌, వ‌ల్ల‌భ ఇక త‌ప్పించుకునే మార్గం లేద‌ని, ఏదైతే అదైంది అన్నింటికి సిద్ధంగా వుండు అని వ‌ల్ల‌భ‌తో సైగ చేస్తుంది తిలోత్త‌మ‌.. ఈ లోగా విశాల్‌నే స్వ‌యంగా తిలోత్త‌మ వేలి ముద్ర‌లు వేయించ‌మంటుంది న‌య‌ని.. అలాగే చేస్తాడు.. షాకింగ్‌.. న‌య‌ని అనుకున్న‌ట్టుగా తిలోత్త‌మ వేలి ముద్ర‌లు మ్యాచ్ కావు.. కానీ అనూహ్యంగా న‌య‌ని వేలి ముద్ర‌లు మ్యాచ్ కావ‌డంతో అంతా షాక్ అవుతారు. న‌య‌ని కూడా ఏంటీ ఇలా జ‌రిగింద‌ని షాక్ అవుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.