English | Telugu

సూసైడ్ చేసుకోబోయిన బులెట్ భాస్కర్!

'జబర్దస్త్' షోలో బులెట్ భాస్కర్ స్కిట్స్ అంటే ఇష్టపడే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఈ స్టేజి మీదకి ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది కమెడియన్స్ వచ్చి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుని చక్కని అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఐతే ఈవారం జబర్దస్త్ షోలో బులెట్ భాస్కర్ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పి అందరినీ షాక్ కి గురి చేశాడు. తాను ప్రేమలో ఓడిపోయాను కానీ జబర్దస్త్ షో ద్వారా ఆడియన్స్ ప్రేమను సంపాదించుకున్నానని చెప్పాడు. "నేను ఒక అమ్మాయిని సిన్సియర్ గా, సీరియస్ గా రెండేళ్ల పాటు ప్రేమించాను, తనతో కలిసున్నానుకూడా. ఆ తర్వాత ఏమయ్యిందో ఏమో ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది." అంటూ స్టేజి మీద తన లవ్ స్టోరీ చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు బులెట్ భాస్కర్.

"పిచ్చెక్కి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రీ, వైజాగ్ అన్నీ ఊర్లు తిరిగేసేవాడిని. సూసైడ్ చేసుకుందామనుకున్నా.. తలకు కూడా ఎన్నో దెబ్బలు తగిలించుకుని తలంతా కుట్లు వేయించుకుని కొన్నాళ్ళు పిచ్చోడినై పోయాను. తర్వాత నన్ను నేను మార్చుకున్నా. నిజంగా ఒక అమ్మాయి మనల్ని మోసం చేస్తే వెళ్లి కొట్టాలి, తిట్టాలి, చంపేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా" అని అత‌న‌న్నాడు.

కానీ అత‌ను మాత్రం అలాంటివి అసలు ఆలోచించలేదు. "ఎందుకంటే నేను నా ఎదుగుదలతోనే వాళ్ళను కొట్టాలనుకున్నాను. నేను ఎదిగితేనే మనల్ని మోసం చేసిన వాళ్ళను చెప్పుతో కొట్టినట్టు అని అప్పుడు డిసైడ్ అయ్యాను. అలా నన్ను నేను ప్రూవ్ చేసుకోడానికి హైదరాబాద్ వచ్చాను. అన్ని ఊర్లు తిరిగి చివరికి హైదరాబాద్ వచ్చాక జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. ప్రతీ అపజయం వెనుక ఒక విజయం ఉంటుంది అనేది నిజమే" అంటూ తన బాధాకరమైన ఫెయిల్డ్ లవ్ స్టోరీని రివీల్ చేసాడు భాస్కర్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.