English | Telugu

బిగ్ బాస్ అగ్నిపరీక్ష... నవదీప్‌ను టార్గెట్ చేసిన కౌశల్ మండా!

బిగ్ బాస్ హిస్టరీలో కౌశల్ మందా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్. ఐతే ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జెస్ మీద ఒక వీడియోలో చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. "బిగ్ బాస్ అగ్నిపరీక్ష స్టార్ట్ అయ్యింది. అభిజిత్ బిగ్ బాస్ 4 విన్నర్, బిందు మాధవి ఓటిటి విన్నర్, ఇక నవదీప్ గారు బిగ్ బాస్ 1 లో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళను కాకుండా ఆ సీజన్ విన్నర్ శివబాలాజీ గారిని తీసుకొచ్చి ఆయనకు ఒక గౌరవం ఇచ్చినట్టు ఉండేది. ఇక మన విషయానికి వస్తే అది ఒక కాంట్రోవర్షియల్ సీజన్ కాబట్టి ఇష్టం లేని ఒక టీమ్ కి ఇష్టం లేని ఒక కంటెస్టెంట్ ని గెలిపించాల్సి వచ్చింది కాబట్టి గెలిపించారు అది కూడా కేవలం ఆడియన్స్ ప్రోద్బలం వల్లే. ఆడియన్స్ అనే వాళ్ళు లేకపోతే గెలవాలని ఎంత కసితో ఆడినా గెలిచే వాళ్ళం కాదు.

ఓట్ల విషయంలో కూడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కాబట్టి ఇక గెలిపించక తప్పలేదు. ఇష్టం లేకుండా నన్ను గెలిపించారు కాబట్టి ఆ తర్వాత నన్ను చాలా దూరం పెట్టారు...అందుకే బిగ్ బాస్ ఏ సీజన్స్ కి పిలవకుండా దగ్గరకు రానివ్వకుండా ..ఐ డోంట్ కేర్ . న్యాయంగా ఆడాను , మీ అందరి ప్రేమతో గెలిచాను. బిగ్ బాస్ చరిత్రలో ఎవరికీ దక్కనంత గౌరవం నాకు దక్కింది. అందుకే నా సీజన్ హోస్ట్ కూడా నా చెయ్యి ఎత్తి పట్టుకునే ఆనవాయితీని పక్కన పెట్టి మానిటర్ లో చూపించి గెలిపించారు. అది నా సీజన్ లో నాకు తప్పా ప్రపంచంలో ఎవరికీ అలా జరగలేదు. అన్ని మనకే అవుతుంటాయి. ఐతే ఇప్పుడు నవదీప్ గారి బదులు శివ బాలాజీ గారిని పెట్టి ఉంటే బాగుండేది. ఇక అంతా వాళ్ళ ఇష్టం కదా. బెస్ట్ కామనర్ కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నా" అంటూ చెప్పాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.