English | Telugu

హగ్ చేసుకుని..ముద్దు పెట్టుకోవాలనుకుంది..!

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక తణుకు నుంచి పవన్ అనే కుర్రాడు వచ్చాడు. రాగానే క్యూట్ గా ఉన్నావ్ అంటూ పొగుడుతూ బుగ్గ గిల్లింది. తానూ ఒక డెమోన్ పవన్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. తానొక స్పోర్ట్స్ పర్సన్ , అలాగే మోడెలర్ అని యూనివర్సిటీ లెవెల్ లో టైటిల్ కూడా గెలుచుకున్నట్టు చెప్పాడు. యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ తో హైదరాబాద్ వచ్చానని బిగ్ బాస్ కి వెళ్లి గెలిచి తన కోరికలన్నీ నెరవేర్చుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. డెమోనిక్ ఎంపరర్ అనే నవల లో హీరో వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడని తానూ అందుకే అలా పేరు పెట్టుకున్నానని చెప్పాడు. ఇక తన స్కిల్స్ చూపిస్తాన్నాయి చెప్పి కాళ్ళు పైకి లేపి చేతుల మీదనే బాలన్స్ చేస్తూ స్టేజి మొత్తం తిరిగాడు. ఫిసికల్ గా ఫిట్ గా ఉంటా, గేమ్స్ టాస్క్స్ ఆడగలను అని చెప్పడానికి ఇవన్నీ చేసి చూపించా అన్నాడు. "ఎవరినైనా ఇష్టపడ్డావా" అని శ్రీముఖి అడిగితె "ఆ అమ్మాయికి చెప్పావా లేదా" అని బిందు మాధవి అడిగింది. "జెన్యూన్ గా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. నేను ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు. ఏ ఫామిలీ ఐనా కూడా పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని అని అడిగితె నువ్వేం చేస్తున్నావ్ అని అంటారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది" అని చెప్పాడు.

"మనల్ని మోసం చేసిన వాళ్ళను ఎం చేయాలి" అని నవదీప్ అడిగాడు. "మోసం చేసిన వాళ్ళను మళ్ళీ మన లైఫ్ లోకి రానివ్వకూడదు" అని చెప్పాడు. "నేను యానిమేషన్ వీడియోస్ చూస్తూ జిమ్నాస్టిక్స్ లో ట్రైనింగ్ అయ్యాను. అలాగే స్ప్రింటర్ గా ట్రైనింగ్ తీసుకున్నా..." అని చెప్పాడు. అలాగే అభిజిత్ అడిగేసరికి లెవెల్ 2 సూపర్ సేన పోజ్ పెట్టి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇక రెండు లారీ టైర్స్ వీపు మీద పెట్టుకుని పుషప్స్ చేసాడు. ఒక డార్కెస్ట్ సీక్రెట్ చెప్పి నేను గ్రీన్ ఇచ్చేస్తాను అని బిందు మాధవి చెప్పేసరికి "నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పిలిచారు. ఆమె నాతో చాలా చెయ్యాలని చూసింది. ఎం చేయలేదు కానీ హగ్ చేసుకోవాలని, కిస్ చేయాలనీ చూసింది. కొంచెం ఎంజాయ్ చేశా కొంచెం చేయలేదు" అని చెప్పాడు. అలా ముగ్గురు గ్రీన్ ఇచ్చేసారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.