English | Telugu

Jayam serial: ఇషిక ప్లాన్ అదే.. రుద్ర కోసం గంగ బాక్సింగ్ నేర్చుకుంటుందా!

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -74 లో.....రుద్రని ఉహించుకొని గంగ తనలో తాను మాట్లాడుకుంటుంది. ఆ పారుని మీరేలా లవ్ చేశారు.. పొగరుబోతు ది అది.. మీకు సెట్ అవదు నేను అయితే మీకు పర్ఫెక్ట్ సెట్ అని గంగ తనలో తనే మాట్లాడుకుంటుంది అదంతా ఇషిక విని షాక్ అవుతుంది. ఇంట్లోకి వచ్చి ఏకంగా ఇంటికి ఓనర్ అవ్వాలని కలలు కంటున్నావా గంగ అని ఇషిక అనుకుంటుంది. అసలు సర్ ఎక్కడ నేను ఎక్కడ అని గంగ అనుకుంటుంది.

ఈ ఒక్క విషయం చాలు నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపడానికి కానీ పర్ఫెక్ట్ ప్లాన్ తో పంపిస్తానని ఇషిక అనుకుంటుంది. మరొకవైపు గంగ మాటలు గుర్తుచేసుకొని పారు నిద్ర పోకుండా ఆలోచిస్తూ బాక్సింగ్ చేస్తుంది. పారు వాళ్ళ అన్నయ్య వచ్చి ఏమైందని ఆడుగగా ఈ రోజు పార్క్ లో ఒకతి నాతో పొగరుగా మాట్లాడిందని చెప్తుంది. అవన్నీ ఏం ఆలోచించకుండా వెళ్లి పడుకోమని వాళ్ళ అన్నయ్య అంటాడు. నేను మర్చిపోను రేపు మళ్ళీ పార్క్ కి వెళ్లి అదేవరో కనుక్కుంటానని పారు అనుకుంటుంది.

మరుసటి రోజు రుద్ర బాక్సింగ్ అకాడమీ నుండి కొందరు వస్తారు. చాలా థాంక్స్ మా ట్యాలెంట్ గుర్తించి మాకు ఛాన్స్ ఇచ్చారని వాళ్ళు అంటారు. అప్పుడే గంగ వస్తుంది. నేను బాక్సింగ్ నేర్చుకుంటే సర్ కి నచ్చుతాను అని అనుకొని నేను నేర్చుకుంటా అంటుంది. ఒకమ్మాయితో నువ్వు నాతో ఫైట్ చెయ్ అంటుంది. ఆ అమ్మాయి ఇచ్చిన ఒకటే పంచ్ కి కిందకిపడుతుంది గంగ. మాటలు మాట్లాడినంత ఈజీ కాదు వెళ్లి వంట చేసుకోమని రుద్ర అనగానే గంగకి కోపం వస్తుంది. ఎలాగైనా నేర్చుకుంటానని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.