English | Telugu

Brahmamudi : బిడ్డ కోసం భర్తను వదలుకుంటానని చెప్పిన భార్య..రాజ్ షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -842 లో..... కళ్యాణ్ ఇంటికి వచ్చి వదిన మీరు హాస్పిటల్ లో చూపించుకోలేదు కదా అంటాడు. నేను హాస్పిటల్ లో చూపించుకోలేదని నీకెలా తెలుసని కావ్య అడుగుతుంది. ఏదో క్యాజువల్ గా అన్నానని కళ్యాణ్ కవర్ చేస్తాడు. కళ్యాణ్ వెళ్ళిపోయాక.. కళ్యాణ్ ఇది వరకు మాట్లాడిన మాటలన్నీ గుర్తుచేసుకుంటుంది. అవి గమనించిన కావ్యకి కళ్యాణ్ కి అన్ని తెలిసి ఉంటాయని అనుకుంటుంది. దాంగో అతన్ని అడగాలని వెళ్తుంది.

కళ్యాణ్ దగ్గరికి కావ్య వస్తుంది. అసలేం జరుగుతుంది.. మీ అన్నయ్య ఎందుకు అబార్షన్ చేపిస్తానని అంటున్నాడని కావ్య అడుగగా కళ్యాణ్ టెన్షన్ పడుతాడు. వెనకాల నుండి రాజ్ చూసి చెప్పొద్దని సైగ చేస్తాడు. దాంతో కళ్యాణ్ నాకు తెలియదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే రాజ్ వస్తాడు.. ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు.. అది కనుక్కుంటానని కావ్య అంటుంది.

మరొక వైపు సుభాష్ ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ ఉంది రమ్మని పిలుస్తాడు. మీ ఇంట్లో జరిగే విషయాలు ఎందుకు బయటకుపోతున్నాయి కావ్యకి రాజ్ అబార్షన్ చేయించాలనుకున్నాడు అంట కదా అని అతను అనగానే సుభాష్, అపర్ణ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో రాజ్ జ్యూస్ లో అబార్షన్ టాబ్లెట్ కలిపాడని కావ్య అందరికి చెప్తుంది. నా బిడ్డ కోసం మిమ్మల్ని దూరం పెట్టడానికి కూడ సిద్ధంగా ఉన్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.