English | Telugu

Jayam serial : రుద్రని ఎమోషనల్ గా లాక్ చేసిన శకుంతల.. పెద్దసారు ఏం చేయనున్నాడు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -104 లో......రుద్ర ఎక్కడ గంగని పెళ్లి చేసుకుంటాడోనని శకుంతల ప్లాన్ ప్రకారం పారు దగ్గరికి వెళ్లి రుద్రని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దానికి తను నో అంటి అని అంటుంది. నేను ఛాంపియన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న కానీ ఇలా ఎక్స్ ఛాంపియన్ కాదని పారు అంటుంది. ఇప్పుడు తన ఏదో సాధించాలని అకాడమీ మొదలు పెట్టాడు.. ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు.. తన గెలుపు నీ వల్లే అయిందని రుద్ర అనుకోవాలి.. అందుకే నిన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నానని పారుతో శకుంతల అంటుంది.

సరే అంటి మీరు నాకు నచ్చింది చేస్తానని మాటివ్వండి అని పారు అనగానే అంత నీ ఇష్టప్రకారమే జరుగుతుందని శకుంతల మాటిస్తుంది. ఆ తర్వాత గంగ ఇంటికి వస్తుంది. నీ కాళ్లకి పట్టీలు ఏం అయ్యాయని లక్ష్మి అడుగుతుంది. రుద్ర సర్ కి ఇచ్చేసాను.. నువ్వు కదా మన హద్దులో మనం ఉండాలన్నావ్.. అందుకే ఇచ్చేసానని గంగ చెప్తుంది. మరోకవైపు రుద్ర నిశ్చితార్థం కి ఏ చీర కట్టుకోవాలని శకుంతల అన్ని చీరలు చూస్తుంది. అప్పుడే పెద్దసారు వస్తాడు. నువ్వు ఎందుకు రుద్రని అడగకుండా వెళ్లి పెళ్లి ఫిక్స్ చేసావని అడుగుతాడు. అంటే ముందు రుద్ర దగ్గరికి వెళ్లి కనుక్కోవాల్సింది అంటున్నారా అని శకుంతల అంటుంది. ఇప్పుడు నువ్వు పెళ్లి ఫిక్స్ చేస్తే రుద్ర చేసుకుంటాడనుకుంటున్నావా అని పెద్దసారు అంటాడు. చేసుకుంటానని చెప్తూ రుద్ర ఎంట్రీ ఇస్తాడు.

అది ఎవరైనా సరే పెద్దమ్మ ఫిక్స్ చేస్తే చేసుకుంటాను.. నేను పెరిగింది తన చేతుల్లోనే.. నా చేతికి గ్లౌస్ లు తొడిగింది తనే అని రుద్ర అంటాడు. శకుంతల రుద్రని ఎమోషనల్ గా లాక్ చేస్తుంది. ఆ తర్వాత రుద్ర వెళ్ళిపోయాక.. నువ్వు రుద్రపై చూపించే ప్రేమ నిజమేనా లేక ఎమోషనల్ గా లాక్ చేస్తున్నావా అని శకుంతలని పెద్దసారు అడుగుతాడు. ఏదో ఒకటి చెప్పి శకుంతల కవర్ చేస్తుంది. తరువాయి భాగంలో బాక్సింగ్ పోటీకి నేను సిద్ధం అని పారుతో గంగ ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.