English | Telugu

Ilu illalu pillalu :  తన ప్రేమ విషయం రామరాజుకి చెప్పాలనుకున్న చందు.. నర్మదకి పెళ్ళిచూపులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -10 లో.....నడిపోడు (సాగర్) తన లవర్ నర్మదని కలవడానికి వస్తాడు. మీ నాన్నతో మిల్ కి రాను గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తానని చెప్పవా అని అడుగుతుందిమ లేదని సాగర్ అంటాడు. ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తున్నారని నర్మద అంటుంది. టైమ్ చూసుకొని చెప్తానని సాగర్ అంటాడు. మా నాన్నకి ప్రేమ వివాహం చేసుకోనని మాటిచ్చిన విషయం చెప్తే నువ్వు తట్టుకోలేవని సాగర్ అనుకుంటాడు.

ఆ తర్వాత ప్రేమ తన లవర్ కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. ఎదురింట్లో ఉన్న చిన్నోడి (ధీరజ్ )ని చూసి బాగా అయింది. భళే ఇరికించానంటూ నవ్వుకుంటుంది. ఏదో ఆడపిల్లవి అందరిముందు పరువు తియ్యడం ఎందుకని ఆగిపోయానని ధీరజ్ అంటాడు. అప్పుడే ధీరజ్ వాళ్ల మామ వచ్చి.. మిమ్మల్ని ఎలాగైన కలుపుతానని అంటాడు. కాసేపటికి రామరాజు వస్తాడు. ఏదో అంటున్నావ్.. వాడు నాకు మాటిచ్చాడు.. నువ్వు వాడిని పాడుచేయ్యకని రామరాజు అంటాడు. మరొకవైపు పెద్దోడు (చందు) తన లవర్ సుభద్రని కలిసి తన నాన్నకి ఇచ్చిన మాట గురించి చెప్తాడు.. దాంతో సుభద్ర బాధపడుతుంది.

ఆ తర్వాత సాయంత్రం ఇంట్లో కరెంటు లేదని రామారాజు కుటుంబం.. ఇంకా భద్రవతి కుటుంబం లు బయట పడుకుంటారు. చందు, సాగర్ లు డల్ గా ఉంటారు. తమ ప్రేమ విషయం రామరాజుకి చెప్పాలి అనుకుంటారు. కానీ భయపడతారు. వేదవతికి కాలు బెనుకుతుంది. రామరాజు తన కాళ్ళు పట్టుకొని మసాజ్ చేస్తుంటాడు. అది ఎదురింట్లో ఉన్న భద్రావతి కుటుంబం చూసి కుళ్ళుకుంటారు. తరువాయి భాగంలో చందు తన ప్రేమ విషయం రామరాజుకి చెప్పాలని అనుకుంటాడు. మరొకవైపు నర్మదకి పెళ్లి చూపులు అని తన పేరెంట్స్ చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.