English | Telugu

సోనియా ఆకుల ఎంగేజ్ మెంట్...వైరల్ అవుతున్న ఫోటోలు!


సోనియా ఆకుల బిగ్ బాస్ సీజన్-8 తో ఫుల్ పాపులర్ అయ్యింది. తన నామినేషన్ చూస్తే అవతలి వాళ్ళు అసలు డిఫెండ్ చేసుకోలేరు.‌ నిజానికి సోనియాని సరిగ్గా డిఫెండ్ చేసే నబీల్ హీరో అయ్యాడు. ఇక సోనియా హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఓ ఊపు ఊపింది.

నిఖిల్‌తో బాగా క్లోజ్‌గా ఉండటంతో వీళ్ల హగ్‌లు, రొమాన్స్‌ వీడియోలు బయటకు వచ్చాయి. దాంతో దారుణంగా ట్రోల్ అయ్యింది. ఈ నెగిటివిటీతోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది సోనియా. ప్రతి సీజన్‌లో బిగ్ బాస్ ఆటకి బలై.. క్యారెక్టర్‌ని కోల్పోయే కంటెస్టెంట్స్ ఒకరిద్దరు ఉంటాడు. అలా ఈ సీజన్‌లో బిగ్ బాస్ ఆటకి బలైంది సోనియా. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు నిఖిల్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న సోనియా.. బయటకు వచ్చిన తరువాత అతని నిజస్వరూపాన్ని తెలుసుకుని పన్నెండవ వారం నామినేషన్స్‌లో భాగంగా హౌస్‌లోకి వెళ్లి మరీ అతని గురించి బయటపెట్టేసింది. ఆడాళ్ల ఎమోషన్స్‌తో ఎలా ఆటలు ఆడుకుంటాడో.. అతను ఎంత మోసగాడో తెలియజేస్తూ నామినేట్ చేసింది. ఇక తాజాగా సోనియా ఎంగేజ్ మెంట్ జరిగిందనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ప్రేమించింది తన ప్రియుడు యష్ వీరగోని(Yashmi Veeragoni). బిగ్ బాస్ కి వెళ్లే ముందే వీరిద్దరు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కానీ బిగ్ బాస్ అవకాశం రావడంతో మనసు మార్చుకుంది సోనియా.

యష్, సోనియాలు డిసెంబర్‌లో నెలలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కాగా.. సోనియా పెళ్లి చేసుకోబోతున్న యష్‌కి ఇది రెండో వివాహం కావడం విశేషం. అతనికి ఇంతకు ముందే పెళ్లి అయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే సోనియాతో పరిచయం తరువాత.. భార్యకి విడాకులు ఇచ్చాడనే విషయం బయటకు వచ్చింది. దీని గురించి అతను ఎక్కడా మాట్లాడలేదు కానీ.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు సోనియా.. తన ప్రియుడు గురించి చెప్తూ అతనికి విడాకులు అయ్యాయనే విషయాన్ని ప్రేరణకి చెప్పింది. అలా వీరి వ్యవహారం బయటకు వచ్చింది. అయితే వీరి వివాహ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలు కానీ.. వీడియోలో కానీ వారి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయకపోవడంతో.. అసలు ఇది రియలా ఫేక్‌నా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.