English | Telugu

Illu illalu pillalu : ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయ్యిందని చెప్పిన చందు.. రామరాజు ఏం చేస్తాడు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -14 లో.....అందరు టిఫిన్ చేస్తుంటే చందు, సాగర్ డల్ గా ఉండడంతో తినండి రా అంటూ రామరాజు భోజనం తినిపిస్తాడు. అలా అందరికి తినిపిస్తూ.. ధీరజ్ తో మాత్రం కోపంగా కలుపుకొని తిను అంటాడు. వాళ్ళ నాన్న తమపై చూపించే ప్రేమకి వాళ్ళ ప్రేమ విషయం చెప్పకుండా ఆగిపోతారు. గుడిదగ్గర జరిగే రిసెప్షన్ కి ఏ బియ్యం కావాలో తెలుసుకొని రండి అంటూ చందు, ధీరజ్ లని రామరాజు పంపిస్తాడు

ఆ తర్వాత ధీరజ్, చందు లు గుడికి వెళ్తారు. అక్కడ లిస్ట్ రాస్తుంటే.. చందు లవర్ సుభద్ర వేరొక అతన్ని పెళ్లి చేసుకొని ఉంటుంది. అది చూసి చందు మనసు ముక్కలవుతుంది. బయటకు వస్తాడు. వెనకాలే దీరజ్ వస్తాడు. తను కూడా సుభద్రని చూసి ఎంత పని చేసావురా నీ భయంతో అమ్మాయిని దూరం చేసుకున్నావని అనగాన్ ధీరజ్ ని చందు హగ్ చేసుకొని ఏడుస్తాడు. మరొకవైపు వేదవతి అతని తమ్ముడు బొమ్మరిల్లు సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతారు. ఇక ముగ్గురు కొడుకులకి ఇలాంటి అమ్మాయిలు వస్తే బాగుంటుందో రామరాజు వాళ్ళతో చెప్తాడు.

మరొకవైపు చందు ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ డ్రింక్ చేస్తుంటాడు. ఆ తర్వాత అన్నయ్య ఎక్కడున్నాడు అనుకొని ఒక రెస్టారెంట్ దగ్గరికి ధీరజ్ వచ్చి కూర్చొని ఉంటాడు. వెనకాలే ప్రేమ, కళ్యాణ్ లు ఉంటారు. కావాలనే ధీరజ్ ని రెచ్చగొట్టేల ప్రేమ మాట్లాడుతుంది. ధీరజ్ కూడా అలా మాట్లాడుతుంటే వచ్చి గొడవ పెట్టుకుంటుంది. ఆ తర్వాత బిల్ కట్టకుండా వెళ్ళిపోయి ధీరజ్ నా లవర్ అని చెప్పి అతనే బిల్ కట్టెలా చేస్తుంది. తరువాయి భాగంలో చందు డ్రింక్ చేసి భద్రవతి కార్ కి ఎదురుపడతాడు. ఆ తర్వాత భద్రావతి వెనకాల కూర్చొని ఉంటుంది. నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిందని చందు చెప్తాడు. అది అంత భద్రావతి వింటుంది‌. ఇక ఇంటికి వచ్చాక ధీరజ్, సాగర్ లు రామరాజు చూడకుండా ఇంట్లోకి తీసుకొని వెళ్ళాలనుకుంటారు కానీ రామరాజు చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.