English | Telugu

Karthika Deepam2 : దీప కోసం మల్లెపూలు తెచ్చిన కార్తీక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. (karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -213 లో.... కార్తీక్ ని సీఈఓ నుండి తప్పించారని దీప బాధపడుతుంటే.. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు.. వాడికి వున్నా తెలివికి వాడు సొంతంగా బిజినెస్ పెట్టుకొని సీఈఓ అవుతాడు. ఆ సలహా నేను ఇవ్వలేకనా కానీ కలిసి పనిచేసుకోవాలని కాంచన అంటుంది. అప్పుడే శౌర్య వస్తుంది. అమ్మా కార్తీక్ ఎక్కడ అని అడగగానే.. శౌర్యాని దీప పక్కకి తీసుకొని వెళ్తుంది. ఏం జరుగుతుందోనని వెనకాల అనసూయ, కాంచన ఇద్దరు వెళ్లి వింటారు.

నువ్వు ఎందుకు కార్తీక్ బాబుని పేరు పెట్టి పిలుస్తున్నావని దీప అడుగుతుంది. మరి ఎలా పిలవాలని శౌర్యా అడుగుతుంది. నిన్న మొన్న ఎలా పిలిచావ్.. అలా పిలువు అని దీప అనగానే.. అలా పిలిస్తే నీకు నచ్చదు కదా అని శౌర్య అంటుంది. లేదు నువ్వు అలాగే పిలువు అని దీప చెప్పగానే.. సరేనని శౌర్య అంటుంది. మన ప్లాన్ సక్సెస్ అని కాంచన అనసూయ ఇద్దరు అనుకుంటారు. మరొకవైపు దశరత్ తో సుమిత్ర మాట్లాడుతుంది. మావయ్య గారు చేసిన పని నాకు నచ్చలేదు. ఏదో మనసులో పెట్టుకొని కార్తీక్ ని తప్పించడం బాగోలేదు.. జ్యోత్సకి ఏం తెలుసని సుమిత్ర అంటుంది. అప్పుడే శివన్నారాయణ‌ వచ్చి.. నేను నా మానవరాలిపై ప్రేమతో ఇదంతా చేసానని అంటాడు. వాడు వచ్చాకే మన కంపెనీకి లాభాలు వచ్చాయని సుమిత్ర అనగానే.. వచ్చాయి, వాటితో పాటు వ్యక్తిగతం జీవితానికి నష్టాలు కూడా వచ్చాయి.. వాడు వాడి తండ్రి చేసిన పనికి అని శివన్నారాయణ‌ కోప్పడతాడు.

ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వస్తాడు. ఏం నిర్ణయం తీసుకున్నారని దీప అడుగుతుంది. ఇక ఏం చేస్తాం కలిసి పని చెయ్యడమే అని కార్తీక్ అంటాడు. కార్తీక్ మల్లె పువ్వులు తీసుకొని వచ్చి దీపకి ఇస్తాడు. దాంతో దీప ఆశ్చర్యంగా చూస్తుంది. అమ్మ తీసుకొని రమ్మంది పూజ కోసం అంట అయిన నువ్వు పెట్టుకుంటే ఏంటని దీపకి ఇస్తాడు కార్తీక్. మరొకవైపు జ్యోత్స్న రౌడీకి ఫోన్ చేసి దీపని చంపెయ్యమని చెప్తుంది. ఆ తర్వాత శౌర్యా కళ్ళలో నలక పడితే దీప, కార్తీక్ ఇద్దరు కలిసి కళ్ళలో పడిన నలకని తీసేయ్యాడని ట్రై చేస్తుంటారు. ఆ తర్వాత దీప చీర కొంగు తీసుకొని ఆవిరి పట్టి నలకని తీసేస్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ చేతులోని కొంగుని తీసుకుంటుంది దీప. పిల్లల కోసం పెద్దవాళ్ళు ఇలా చిన్న చిన్న ఇబ్బందులు భరించాలి.. దానికి మనం తప్ప ఎవరున్నారని దీపతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.