English | Telugu

Illu illalu pillalu : ఒక్కటైన ఇద్దరు కోడల్లు.. బావకి సంబంధం చూసిన నర్మద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -80 లో..... వేదవతి, నర్మదలు కలిసి ప్రేమ కాలేజీకి వెళ్ళడానికి ఒప్పిస్తారు. ప్రేమ రెడీ అయి వస్తుంది. ఇద్దరు కలిసి వెళ్ళండి అని నర్మదతో వేదవతి చెప్తుంది. అలా అంటారేంటి ప్రేమ, దీరజ్ లు ఒకటే కాలేజీ కదా.. వాళ్ళని ఇద్దరిని పంపిస్తే దగ్గరవుతారు కదా అని నర్మద సలహా ఇస్తుంది. దంతో వేదవతి.. ప్రేమని తీసుకొని వెళ్ళమని ధీరజ్ తో చెప్తుంది.

ధీరజ్ బైక్ పై ప్రేమెక్కుతుంది. భద్రవతి వాళ్లు అదంతా చూస్తుంటారు‌. దాంతో ప్రేమ భయపడి బైక్ దిగుతుంది. వేదవతి వచ్చి బైక్ ఎక్కమని చెప్పి దిష్టి తీస్తుంది.. ధీరజ్ ఇల్లు దాటాక ప్రేమ ని దింపేసి వెళ్ళిపోతాడు. దాంతో ప్రేమ బస్టాండ్ కి వెళ్తుంది. అక్కడ నర్మద కలుస్తుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే నర్మద వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి నర్మద మాట్లాడితే తను కోపంగా మాట్లాడుతుంది. దాంతో నర్మద బాధపడుతుంది. అప్పుడే సేనాపతి అటుగా వెళ్తాడు. ప్రేమ మాట్లాడబోతుంటే తను కోపంగా వెళ్లిపోతాడు. దాంతో ప్రేమ బాధపడుతుంది.

మరొకవైపు పెద్దోడికి సంబంధం క్యాన్సిల్ అయిందని రామరాజు తిరుపతితో చెప్తూ బాధపడుతుంటాడు. నర్మద పెళ్లి తర్వాత ఆఫీస్ కి వెళ్ళింది కాబట్టి అందరు తనకి విషెస్ చెప్తారు. నర్మద ఫ్రెండ్ తన దగ్గరికి వస్తుంది. మా బావ గారికి సంబంధం చూస్తున్నామని నర్మద అనగానే మా రెలెటివ్స్ ఉన్నారని తను నర్మదతో అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.