English | Telugu

Illu illalu pillalu : అతనితో వెళ్ళిపోయిన కూతురు.. బాధ తట్టుకోలేక గన్ గురిపెట్టుకున్న తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -50 లో..... వేదవతి నర్మదలని మీరు రూమ్ లో పడుకోండి.. నేను బయట పడుకుంటానని చెప్పి ధీరజ్ బయటపడుకుంటాడు. అప్పుడే ప్రేమని తీసుకొని అదే హోటల్ కి వస్తాడు కళ్యాణ్. ధీరజ్ పక్క నుండే లోపలికి వెళ్తారు. వాడికి ఫోన్ చేయాలంటూ ప్రేమని అమ్మే అతనికి ఫోన్ చేసి డబ్బు పట్టుకొని రమ్మని చెప్తాడు. ఎలాగూ అమ్ముతున్నాం కదా.. ఇంత అందాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకనుకుంటూ ప్రేమపై చెయ్ వేస్తాడు. దాంతో కళ్యాణ్ పై కోప్పడుతుంది ప్రేమ.

ఆ తర్వాత ప్రేమ తన కుటుంబాన్ని వదిలేసి వచ్చినందుకు బాధపడుతుంది. నేను వచ్చేసానని ఇప్పటికి ఇంట్లో వాళ్లకి తెలిసిపోయిందా అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో పెళ్లి హడావిడి మొదలవుతుంది. రేవతి ప్రేమ గదిలోకి వెళ్తుంది అక్కడ ఒక లెటర్ ఉంటుంది. అది చూసి రేవతి వచ్చి భద్రవతికి చూపిస్తుంది. అది చూసి భద్రవతి షాక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మన ఇంటి పరువుపోయిందని భద్రవతి బాధపడుతుంది. మరొకవైపు వేదవతి వాళ్లు గుడికి వెళ్తుంటారు. కళ్యాణ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చి పెళ్లికి అంతా సిద్ధం చేశారని అంటాడు. మరొక వైపు బయట సేనాపతి మైక్ లో పెళ్లి గురించి మాట్లాడుతుంటే.. రేవతి వచ్చి అసలు విషయం చెప్పి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఏంటి కంగారుగా వెళ్తున్నారని రామరాజు, తిరుపతి అనుకుంటారు. తిరుపతి భద్రావతి ఇంటికి వస్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లిన సేనాపతికి ప్రేమ లేచినపోయిన విషయం తెలుస్తుంది.

ఆ తర్వాత ఊళ్ళో పెళ్లికి వచ్చిన వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటారు. దాంతో సేనాపతి గదిలోకి వెళ్లి గన్ తీసుకొని.. తల దగ్గర పెట్టుకుంటాడు. దాంతో అందరు డోర్ తియ్యమని అరుస్తారు. మరొకవైపు తిరుపతి వెళ్లి జరిగింది మొత్తం రామరాజుకి చెప్తాడు. అన్నయ్య డోర్ వేసుకున్నాడని తిరుపతి చెప్పగానే.. వెళ్లి కాపాడు అని రామరాజు అంటాడు. రామరాజు వెళ్ళబోతు ఆ గీత దగ్గర ఆగిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.