English | Telugu

Illu illalu pillalu : నిజం తెలుసుకున్న తండ్రి.‌. ఇద్దరిని చితకబాదాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -19 లో.....రామరాజుతో తన ప్రేమ విషయం చెప్పి.. నర్మద వాళ్ళింటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాలనుకున్నాడు సాగర్. కానీ చందు డ్రింక్ చేసి రావడంతో కోపంతో ఉన్న రామరాజుని చూసి విషయం చెప్పలేకపోతాడు సాగర్. ఇక పదే పదే నర్మద ఫోన్ చేసి వస్తున్నారా అంటూ అడుగుతుంది దాంతో ధీరజ్ వెళదామని అనడంతో సాగర్ వస్తున్నామని చెప్తాడు.

దాంతో నర్మదా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత నర్మద వాళ్ళ నాన్న బయటకు వెళ్తుంటే వద్దని ఆపుతుంది. మొదటిసారి మా ఇంటికి మా అత్త మామలు వస్తున్నారంటూ అందంగా రెడీ అవుతుంది. అప్పుడే ధీరజ్, సాగర్ లు రావడం చూసి.. మీ వాళ్లు ఎక్కడ అంటూ నర్మద అడుగుతుంది. వాళ్ళు రావట్లేదు.. అసలు మీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేదని ధీరజ్ చెప్పగానే మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అంటూ నర్మధ అంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి.. ఎవరు అని అడుగుతాడు. అంకుల్ మీతో మాట్లాడాలంటూ ధీరజ్, సాగర్ లోపలికి వెళ్తారు. మేమ్ రామరాజు గారి అబ్బాయిలం. మా అన్నయ్య, మీ కూతురు ప్రేమించుకున్నారు.. అన్నయ్య మా ఇంట్లో ఈ విషయం చెప్పలేదు. మీరు వెళ్లి మా నాన్నతో మాట్లాడండి అనగానే.. సరే నేను మాట్లాడుతనని నర్మద వాళ్ల నాన్న ప్రసాద్ రావు అంటాడు.

ఆ తర్వాత రామరాజు దగ్గరికి ప్రసాద్ రావు వెళ్లి.. మీ వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడి వెళ్లారు. మీపై ఉన్న గౌరవంతో మీకు చెప్తున్నా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడిని అని అతను చెప్పి వెళ్ళగానే.. కోపంగా రామారాజు ఇంటికి వస్తాడు. సాగర్, ధీరజ్ లని కోపంగా కొడతాడు రామరాజు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.