English | Telugu

Illu illalu pillalu: నీ వల్లే మా అన్నయ్య పెళ్ళి ఆగిపోయింది.. రామరాజు ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -78 లో.... అమ్మాయి తండ్రికి భద్రవతి ఫోన్ చేసి.. రామరాజు కుటుంబం గురించి తప్పుగా చెప్తుంది. దాంతో రామరాజుకి అమ్మాయి తండ్రి ఫోన్ చేసి.. ఈ సంబంధం వద్దని అనుకుంటున్నాము.. మీ కొడుకులు లేచిపోయి పెళ్లి చేసుకున్నారంట కదా అని అనగానే.. రామరాజు బాధపడతాడు.

అప్పుడే సాగర్, నర్మద, ప్రేమ, ధీరజ్ ల ఫోటో షూట్ తిరుపతి జరిపిస్తుంటాడు. తిరుపతి వచ్చి సంబంధం ఏమైందంటూ అడిగేసరికి తన చెంప చెల్లుమనిపిస్తాడు రామరాజు. అదంతా చూస్తున్న భద్రవతి.. నీ కొడుకుకి పెళ్లి కాకుండా చేస్తాను. నువ్వు బాధపడేలా చేస్తానని అనుకుంటుంది. రామరాజు లోపలికి వెళ్తాడు. చందు వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. మంచి సంబంధం చూసాను కానీ వీళ్ళ వాళ్ళ క్యాన్సల్ అయిందంటూ రామారాజు కోప్పడతాడు. నాకు అర్థమవట్లేదు నాన్న.. మీరేం అంటున్నారోనని సాగర్ అడుగుతాడు. అన్నకి కాకుండా తమ్మళ్ళు పెళ్లి చేసుకున్నారు. అది పెంపకం అంటూ అవమానించారని రామరాజు అంటాడు. నాన్న నా తమ్ముళ్ళని ఏం అనకు నేను బాధపడుతానని చందు అంటాడు. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలిసిందంటూ సాగర్ బాధపడుతుంటే నర్మద కూడా బాధపడుతుంది.

మరొకవైపు ఇదంతా నీ వళ్లే అంటూ ప్రేమపై ధీరజ్ అరుస్తాడు. చందు దగ్గరికి సాగర్ ధీరజ్ లు వచ్చి.. మా వళ్లే ఇదంతా అని బాధపడతారు.తరువాయి భాగం లో ధీరజ్ కాలేజీ కి వెళ్తుంటే.. ప్రేమని కూడా తీసుకొని వెళ్ళమని వేదవతి చెప్తుంది. దాంతో ఇద్దరు కాలేజీకి బండిపైన వెళ్ళడానికి సిద్ధమవుతారు. అప్పుడే భద్రవతి కుటుంబం చూస్తూ ఉండడంతో ప్రేమ బండి మీద నుండి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.