English | Telugu

బిఆర్ఎస్ నేత హరీష్ రావుతో రాకింగ్ రాకేష్


కమెడియన్ రాకింగ్ రాకేష్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు మూవీస్ లో కూడా నటిస్తున్నాడు. ఐతే ఇప్పుడు తనే హీరోగా, నిర్మాతగా కెసిఆర్ ...కేశవ చంద్ర రమావత్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కాబోతోంది.ఈ నేపథ్యంలో రాకేష్- సుజాత కలిసి తమ బిడ్డతో హరీష్ రావు దగ్గర వెళ్లారు. అక్కడ హరీష్ రావుకు ఈ మూవీ గురించి రాకేష్ ఎక్స్ప్లైన్ చేస్తూ ఉన్నాడు. చరిత్రలో కెసిఆర్ మూవీ ఒక భాగం కాబోతోంది. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీదకు తీసుకురాబోతున్న రాకేష్ కి కంగ్రాట్యులేషన్స్ అంటూ హరీష్ రావు చెప్పారు. అలాగే ఈ మొయివే హిట్ కొట్టాలంటూ హరీష్ రావు రాకేష్ కి విషెస్ చెప్పారు.

మూవీ రిలీజ్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు రాకేష్. తన సినిమా పోస్టర్స్ ని తానే గోడలకు అతికించుకున్నాడు. ఇక రాకేష్ ని హరీష్ రావుతో చూసిన నెటిజన్స్ మాత్రం ఆల్ ది బెస్ట్ ..ఇప్పుడు ఈ మూవీ పరిస్థితి ఏమో కానీ రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ సపోర్ట్ బాగా ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం తన ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చానని, తాను సంపాదించింది మూవీ కోసమే పెట్టేశానని చెప్పుకొచ్చాడు.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.