English | Telugu
ఎక్స్‌ట్రా జబర్దస్త్.. రోజా ప్లేస్‌లో ఖుష్బూ ఎంట్రీ!
Updated : Jul 11, 2022
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కి రోజా గుడ్ బై చెప్పడంతో షో కొంత వరకు కళ తప్పింది. ఆ మెరుపులు, పంచ్ లు కనిపించడం లేదు.. రోజా ప్లేస్‌లో ఇంద్రజ వచ్చి చేరారు. ఆమె చైర్ లో పర్మినెంట్ గా సెటిలైపోయారు. అయితే రోజా రేంజ్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారని వీక్షకులు అంటున్నారు. షోలో జడ్జిగా వ్యవహరిస్తూనే కంటెస్టెంట్ లతో స్కిట్ లు చేస్తూ మధ్య మధ్యలో పంచ్ లు వేస్తుండేవారు రోజా. అయితే ఆమె జబర్దస్త్ ని వీడటంతో ఆ లోటు కనిపిస్తూనే వుంది. తాజాగా స్టార్ మాలో మొదలైన `సూపర్ సింగర్` షోలో కనిపిస్తున్న మనో.. దాని కోసం ఈ షోని వీడారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఆయన కూడా జబర్దస్త్‌లో కొంత కాలం నుంచీ కనిపించడం లేదు.
అయితే ఆ అనుమానాలని నిజం చేస్తూ మనో స్థానంలో కొత్తగా మరో క్రేజీ నటిని తీసుకొచ్చారు. ఆ నటే.. ఖుష్బూ. ఈ మధ్య బొద్దుగా వున్న ఆమె షాకిచ్చేలా స్లిమ్ గా మారిపోయారు. హీరోయిన్ గా మాంచి క్రేజ్ వున్న దశలో ఎలా వుండేవారో ఇప్పుడు అదే స్థాయిలో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఖుష్బూ ఎంత సీరియస్ గా వుంటారో అంతే సరదాగా పంచ్ లు వేస్తారట. ఆ కారణంగానే రోజా లేని లోటుని తీర్చాలంటే ఈమె కరెక్ట్ అని భావించిన మల్లెమాల వారు ఎక్స్‌ట్రా జబర్దస్త్ కోసం వెంటనే కుష్బూని రంగంలోకి దించేశారు.
తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. బ్లాక్ డ్రెస్ లో కుర్ర హీరోయిన్ తరహాలో ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ జిల్ జిల్ జిగేల్ అంటూ మెరుపులు మెరిపించారు. `చిన్నతంబి` సినిమాను రీమేక్ చేస్తున్నామని బుల్లెట్ భాస్కర్ స్కిట్ చేయగా నాకు అది రీమిక్స్ లా వుందని ఖుష్బూ పంచ్ వేయడం నవ్వులు పూయిస్తోంది. ఇక కొత్తగా షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూకు వెల్కమ్ చెప్పిన ఆటో రాంప్రసాద్ పంచ్ వేయబోయాడు.. కానీ ఖుష్బూ రివర్స్ పంచ్ వేయడంతో నాలుక కరుచుకున్నాడు. నెట్టింట్లో ఈ ప్రోమో సందడి చేస్తోంది. ఫుల్ ఎపిసోడ్ మాత్రం జూలై 15న ప్రసారం కానుంది.