English | Telugu
స్టేజ్ పైనే అషురెడ్డికి ప్రపోజ్ చేసిన హరి..!
Updated : Jul 10, 2022
కమెడియన్ హరి, అషురెడ్డి ల మధ్య లవ్ ట్రాక్ గత కొన్ని నెలలగా సాగుతోంది. `కామెడీ స్టార్స్`లో మొదలై ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే వుంది. అషు కనిపిస్తే చాటు హరి లవ్ సీన్ లోకి వెళ్లిపోయి ఊహల్లో తేలిపోతుంటాడు. తాజాగా నాగబాబు నిర్వహిస్తున్న`పార్టీ చేద్దాం పుష్ప` స్పెషల్ షోలోనూ ఈ ఇద్దరు మెరిసారు. ఈ షోలో పాల్గొన్న హరి స్టేజ్ పైనే అషురెడ్డికి ప్రపోజ్ చేశాడు. అయితే ఊహించని విధంగా అషురెడ్డి షాకింగ్ రిప్లై ఇచ్చింది. బుల్లితెరపై స్టార్ మా లో ఈ స్పెషల్ షో ప్రసారం అవుతోంది.
గత ఆదివారం పార్ట్ 1 ని ప్రసారం చేసిన స్టార్ మా ఈ వారం పార్ట్ 2 ని ప్రసారం చేయబోతోంది. ఇందులో కామెడీ స్టార్స్ కమెడియన్స్ అంతా పాల్గొని రచ్చ రచ్చ చేశారు. అనసూయ తనదైన డాన్సింగ్ మెరుపులతో రచ్చ రచ్చ చేసింది. `విక్రాంత్ రోణా` మూవీలోని `రారా రక్కమ్మ..` సాంగ్ కు స్టెప్పులు ఇరగదీయడమే కాకుండా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసి మతలు పోగొట్టింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రమో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆదివారం ప్రసారం అవుతున్న ఈ షోలో హరి, అషురెడ్డిపి స్టేజ్ పైనే ప్రపోజ్ చేయడం అక్కడున్న వారిని షాక్ కు గురిచేసింది. ఈ షోలో పాల్గొన్న కమెడియన్స్ తమదైన స్టైల్ ఆటపాటలతో, నవ్వించే స్కిట్ లతో ఆకట్టుకోగా హరి మాత్రం అషుకు లవ్ ప్రపోజ్ చేసి షాకిచ్చారు. అంతా తను ఇవ్వడమేనా నువ్వేమైనా ఇచ్చేది వుందా అని అడుగుతున్నారని, నేనేం ఇవ్వగలను నా గుండెను గులాబీలా మార్చి అమె గుమ్మం ముందుంచడం తప్ప.. ఎందుకంటే ఆమె నా దేవత అని అషుకు ప్రపోజ్ చేశాడు. దీనిపై సుడిగాలి సుధీర్ పంచ్ వేశాడు. హరిపై నీ ఫీలింగ్ ఏంటీ? అంటూ అషుని అడిగితే అషు సిగ్గుల మొగ్గయ్యిందే కానీ రిప్లై మాత్రం ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.