English | Telugu

Eto Vellipoyindhi Manasu : కొడుకు, కోడలిని చంపించించిన సవతి తల్లి... ఆస్తులు వస్తాయా మరి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -325 లో.... సిరికి నొప్పులు మొదలు అయ్యాయని ధన ఫోన్ చెయ్యగానే సీతాకాంత్ వెళ్ళబోతుంటే రామలక్ష్మి ఆపుతుంది. ఎందుకు వద్దని అంటున్నావ్.. అక్కడ నా చెల్లి కడుపులో మా నాన్న పుట్టబోతున్నాడని సీతాకాంత్ అనగానే.. సీతాకాంత్ కు ప్రమాదం ఉందని స్వామి చెప్పిన విషయాన్ని రామలక్ష్మి చెప్తుంది.

మరి నాకు ఎందుకు చెప్పలేదని సీతాకాంత్ అడుగగా.. మీరు మీ గురించి కాకుండా నా గురించి ఆలోచిస్తారని చెప్పలేదని రామలక్ష్మి అంటుంది. చచ్చిపోయేది ఉంటే ఎక్కడున్నా చచ్చిపోతాను.. ఇప్పుడు నేను వెళ్ళాలి.. నన్ను ఆపితే నేను చచ్చినంత ఒట్టే అని అంటాడు. నువ్వు ఇక్కడే ఉండమని రామలక్ష్మిని అనగానే.. లేదు వస్తానంటూ సీతాకాంత్ తో రామలక్ష్మి వెళ్తుంది. ఇద్దరు వెళ్తుంటే దారిలో రౌడీ లు ఉంటారు. రౌడీ లు సీతాకాంత్, రామలక్ష్మిలని షూట్ చేస్తారు. నువ్వు చెప్పిన మాట వినలేదు రామలక్ష్మి అని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు వెంటనే చనిపోతారు.

మరొకవైపు సిరికి ఆపరేషన్ జరుగుతుంటుంది. ఆపరేషన్ థియేటర్ బయట శ్రీలత వాళ్ళుంటారు. అప్పుడే రాజీవ్ వచ్చి ఇక ఆస్తులు మీ సొంతం రామలక్ష్మి సీతాకాంత్ లేరని చెప్తాడు. ఇంత అన్యాయం చేస్తారా అని ధన కోప్పడతాడు. నువ్వు కూడ మాతో ఆస్తి కోసం ఉన్నావ్ కదా అని శ్రీలత అంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి.. బాబు పుట్టాడు కానీ మీ కూతురు చనిపోయిందని చెప్తాడు. శ్రీలత ఏడుస్తుంది. సిరి దగ్గరికి ధన వెళ్లి ఎమోషనల్ అవుతాడు. మీరు చేసిన పాపం వళ్లే ఇలా అయిందని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత శ్రీలత సిరి ఫోటో చూస్తూ బాధపడుతుంది. అప్పుడే సందీప్ లాయర్ వస్తాడు. ఇక ఆస్తులు మొత్తం మాకే కదా అని సందీప్ అనగానే.. లేదు దానికి పెద్ద ప్రాసెస్ ఉందని లాయర్ అంటాడు. దాంతో సందీప్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.