English | Telugu
Eto Vellipoyindhi Manasu : రామ్ తల్లి సిరి అని తెలుసుకున్న రామలక్ష్మి.. సీతాకాంత్ ని తప్పుగా అర్థం చేసుకుందా!
Updated : Mar 11, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -348 లో....రామలక్ష్మి, సీతాకాంత్, రామ్ కలిసి మేడ పైనుండి వస్తుంటే.. వాళ్ళు ఆ బాబుకి పేరెంట్స్ లా ఉన్నారని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. హ్యాపీ బర్త్ డే రామ్ అని మమత అంటుంటే.. తల్లివి అయి ఉండి ఇంత లేట్ గా విష్ చేస్తారా అని రామలక్ష్మి అంటుంది. ఈ మేడమ్ ప్రవర్తన ఎందుకో మమత అక్క విషయంలో తేడా గా ఉందని సీతాకాంత్ తో శ్రీవల్లి అంటుంది. దాంతో మొదటి నుండి రామలక్ష్మి మమతతో మాట్లాడింది గుర్తుచేసుకుంటుంది. మమత గారిని రామలక్ష్మి నా భార్య అనుకుంటుంది. అసలు విషయం తెలిసేలా చేస్తానని సీతాకాంత్ అనుకుంటాడు.
మరొకవైపు ఫణీంద్ర, సుశీలలు మైథిలి గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం మైథిలీని తీసుకొని వెళ్ళేది లండన్.. ఆ విషయం చెప్పి తనని కన్విన్స్ చెయ్యాలని సుశీలతో ఫణీంద్ర చెప్తాడు. ఆ తర్వాత కేక్ కట్ చేస్తుంటే మీరెందుకు ఇక్కడ ఉన్నారు.. బాబు పక్కన ఉండండి అని మమతతో రామలక్ష్మి అంటుంది. ఇక్కడే ఉంటానని మమత అంటుంది. రామ్ పిలవగానే రామలక్ష్మి, మమత ఇద్దరు పక్కకి వెళ్తారు. రామ్ కేక్ కట్ చేసి సీతాకాంత్ కి పెట్టబోతుంటే.. అమ్మకి పెట్టాలి కదా అని చెప్తాడు. దాంతో రామ్ కేక్ పట్టుకొని సిరి ఫోటో దగ్గరికి వెళ్తాడు. ఆ ఫోటో చూసి రామలక్ష్మి షాక్ అవుతుంది. సీతా గారు రామ్ ని నాన్న అన్నపుడే అర్థం చేసుకోవాల్సిందని రామలక్ష్మి బాధపడుతుంది. మా అమ్మ అని అడిగారు కదా తనే మా అమ్మ అని రామ్ చెప్తుంటే.. రామలక్ష్మి ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటుంది. నేను సీతా గారిని తప్పుగా అర్థం చేసుకున్నానని బాధపడుతుంది.
మీరు చూస్తుంది అంతా నిజం మైథిలి గారు.. నా చెల్లి కొడుకు రామ్ అని సీతాకాంత్ చెప్తాడు. అదంతా విని రామలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే వెయిటర్ జ్యూస్ తీసుకొని వస్తుంటే.. తనపై పడిపోతుంది. రామలక్ష్మి క్లీన్ చేసుకుంటానంటు ఒక గదిలోకి వెళ్తుంది. అక్కడ తన ఫోటో చూసి షాక్ అవుతుంది. గదిలో రామలక్ష్మిపై ప్రేమని సీతాకాంత్ అక్కడ పేపర్స్ పై రాస్తాడు. అదంతా చూసి రామలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే మిస్ అంటూ రామ్ పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.