English | Telugu

ధోప్ కాన్సెప్ట్ డైరెక్టర్ శంకర్ దే...


ఈ వారం సుమ అడ్డా షోకి "భైరవం" మూవీ టీమ్ వచ్చింది. ఇందులో రాజా రవీంద్ర, డైరెక్టర్ శంకర్ తనయ అదితి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వచ్చారు. ఐతే ఇందులో రామ్ చరణ్ పిక్ ని ప్లే చేసేసరికి అదితి ఫుల్ గా సిగ్గుపడిపోయింది. "మగధీర మూవీ నేను ఫస్ట్ టైం థియేటర్ లో చూసాను. రామ్ చరణ్ కి నేను బిగ్ ఫ్యాన్ ని. ఐతే ఈ మూవీ వచ్చిన కొత్తలో రామ్ చరణ్ పిక్స్ ని పేపర్ లో వచ్చినప్పుడు వాటిని కట్ చేసి స్టిక్కర్స్ గా ఇంట్లో అతికించుకునేదాన్ని. ఇప్పుడు చెప్పాలంటే ఆ విషయాలు కొంచెం ఎంబరాసింగ్ గా ఉంది.ఆయన అంటే చాలా గౌరవం, ప్రేమ రెండూ ఉన్నాయి " అంటూ తెగ సిగ్గుపడిపోయింది.

ఇక అదితి ఈ గేమ్ చెంజర్ మూవీలో ధోప్ సాంగ్ పాడింది అని సుమ చెప్పింది. అదితితో ఆ సాంగ్ వి కొన్ని లైన్స్ పాడించింది. "సరే ధోప్ అని వదిలేయాలి అంటే ఎం వదిలేస్తారు" అని అదితిని అడిగింది. "నా కోపాన్ని వదిలేస్తాను. మా నాన్న ఈ ధోప్ కాన్సెప్ట్ ని ఇంట్లోనే ఇంట్రడ్యూస్ చేశారు." అని చెప్పింది. తర్వాత సందీప్ మీరేమి వదిలేస్తారు ధోప్ అని సుమ అడిగింది. "భూతుల్ని వదిలేస్తాను" అని చెప్పాడు. "సందీప్ నీకు బూతులు వచ్చా" అని అడిగింది ఆసక్తిగా సుమ. "పెళ్ళాయ్యాకే వాటిని వదిలేయడం స్టార్ట్ చేశా" అని చెప్పాడు. ఇక అదితి శంకర్ చాలా మందికి తెలిసిన అమ్మాయే. మెడిసిన్ చదివిన ఈమె లాస్ట్ ఇయర్ స్టార్ హీరో కార్తీ సరసన ‘విరుమన్’ సినిమాలో నటించి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శివకార్తికేయన్ తో ‘మావీరన్’ మూవీలో హీరోయిన్ గా నటించింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.