English | Telugu

Bigg Boss 9 Telugu Demon Pavan: ఇదే ఫైర్ ముందు నుండి ఉంటే డీమాన్ విజేత!

బిగ్ బాస్ చివరి వారం హౌస్ లో టాప్-5 వాళ్ళకి ట్రీట్ కోసం బిగ్ బాస్ కొన్ని టాస్క్ లు పెట్టాడు. ఎక్కువ టాస్క్ లు గెలిచి ప్లేయర్ అఫ్ ది డే అయిన వాళ్లకి వాళ్ళ ఇంటి నుండి మెసేజ్ వస్తుంది. అలా డీమాన్ పవన్ రెండు టాస్క్ లు గెలిచి.. రెండు స్టార్స్ పొందాడు. కాబట్టి అతనికి ప్లేయర్ అఫ్ ది డే వచ్చింది. ఫుడ్ కి సంబంధించిన రెండు ట్రీట్స్ ఇంకా తన ఫ్యామిలీ నుండి వీడియో మెసేజ్ వస్తుంది.

డీమాన్ వాళ్ళ అన్నయ్య మెసేజ్ వస్తుంది. అది చూసి డీమాన్ ఎమోషనల్ అవుతాడు. నేను ఇంత దూరం వచ్చానంటే దానికి కారణం బిగ్ బాస్.. గట్టిగా అరుస్తే ఎదుటివారు బ్యాడ్ అవుతారేమో అని నేను ఏది ఎక్స్ ప్రెస్ చెయ్యలేదు చేసి ఉంటే ఇంకా బాగుండేదనుకుంటాడు. నాకు ఈ హౌస్ వదిలి పెట్టి వెళ్లాలని లేదని డిమాన్ ఒక్కడే కూర్చొని ఎమోషనల్ అవుతాడు. ఇక తర్వాత రోజు మళ్ళీ టాస్క్ లు పెట్టగా అందులో ఒక టాస్క్ నాలుగు రౌండ్స్ గా జరిగింది. మూడు రౌండ్స్ లో సంజన, డీమాన్, కళ్యాణ్ విన్ కాగా కళ్యాణ్ కి డిమాన్ కి చివరి రౌండ్ ఉంటుంది. అందులో డీమాన్ గెలిచి ఫుడ్ ట్రీట్ గెలుస్తాడు.. అలా ప్రతీ టాస్క్ లో డీమాన్ గెలుస్తాడు. తదుపరి టాస్క్ లో తనూజ గెలుస్తుంది. తనకి ఫుడ్ ట్ర్రీట్ వస్తుంది.

ప్లేయర్ అఫ్ ది డే లో భాగంగా తనూజకి ఇంటి నుండి తన సిస్టర్ మ్యారేజ్ ఫోటో వస్తుంది. అందులో తనని ఫోటో షాప్ ద్వారా యాడ్ చేస్తారు. అది చూసి తనూజ ఏడుస్తుంది. ఇది హ్యాపీ మూమెంట్ అని సంజన అంటుంది. ఫ్యామిలీ నుండి మెసేజ్ వచ్చింది. ఇమ్మాన్యుయేల్ కి బిగ్ బాస్ ఫ్యామిలీ స్క్రిప్ట్ ఇవ్వగా అందరు కలిసి మంచి స్క్రిప్ట్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.