English | Telugu

Podharillu: చక్రికి సపోర్ట్ గా మహా.. ఆ ఇద్దరు కలుస్తారా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -07 లో......చక్రి కార్ లో ఒకమ్మాయి ఎక్కుతుంది. మీకు పెళ్లి కాలేదా అని చక్రి అడుగుతాడు. లేదని ఆ అమ్మాయి చెప్తుంది. నా దగ్గర ఇలాంటి కార్ లు బాగా ఉన్నాయని చక్రి బిల్డప్ ఇస్తాడు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చక్రి అంటాడు. పెళ్లి అవన్నీ కాదు లివింగ్ రిలేషన్ లో ఉందామని ఆ అమ్మాయి అనగానే నాకు కావాల్సింది పద్ధతి గల అమ్మాయి నీలా కాదని తనని మధ్యలోనే దింపుతాడు.

మరొకవైపు ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాలని వాళ్ళ నాన్నని రిక్వెస్ట్ చెయ్యడానికి ప్రాక్టీస్ చేస్తుంది మహా. అప్పుడే వాళ్ళ నాన్న పిలుస్తాడు. కిందకి వెళ్లేసరికి అబ్బాయి వాళ్ళుంటారు. వీడు అప్పుడే వచ్చేసాడా అని తిట్టుకుంటుంది మహా. మీరు షాపింగ్ కి వెళ్లి రండి అని వాళ్ళని పంపిస్తాడు ప్రతాప్. మహా పక్కన అబ్బాయి భూషణ్ కూర్చొని ఉంటే వాళ్ళ వదినకి వద్దని సైగ చేస్తుంది. మా అయన పడుకుంటారు. భూషణ్ నువ్వు డ్రైవ్ చెయ్యమని హారిక చెప్పగానే.. భూషణ్ డ్రైవ్ చేస్తాడు. మరొకవైపు మాధవ అమ్మాయి వాళ్లకి నచ్చడు కానీ వాళ్ళు ఒకసారి ఇంటికి వచ్చి చూస్తారట అని మీడియేటర్ వచ్చి చెప్తాడు.

మరొకవైపు చక్రి కార్, భూషణ్ వాళ్ళ కార్ రెండు డ్యాష్ ఇచ్చుకుంటాయి. తప్పు భూషణ్ ది అయిన కూడా చక్రిపై గొడవకి దిగుతాడు. దాంతో మహా వస్తుంది. తనని చూసి చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. తప్పు మీదే తనది కాదని చక్రికి మహా సపోర్ట్ చేస్తుంది. దాంతో భూషణ్ కి కోపం వస్తుంది. మనకి విలువ ఇవ్వాలంటే ఇతరులకు కూడా ఇవ్వాలని మహా చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళని ఫాలో అవ్వాలని చక్రి అనుకుంటాడు కానీ కార్ స్టార్ట్ అవ్వదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.