English | Telugu
హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్న మేఘన లోకేష్
Updated : Jun 21, 2022
మేఘన లోకేష్ "కల్యాణ వైభోగం" సీరియల్ తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటి. మంగతాయారు పాత్రతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది మేఘన. ఈమె కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఇటు తెలుగుతో పాటు అటు కన్నడలో కూడా ఈమె ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఐతే మేఘన బెంగళూరుకి చెందిన స్వరూప్ భరద్వాజ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళై మూడేళ్లయిన సందర్భంగా ఇటీవల మ్యారేజ్ యానివర్సరీని జరుపుకుంది. " మీతో ఇలాంటి మరెన్నో మధురమైన క్షణాలను గడపాలని ఉంది. మూడేళ్ళుగా నన్ను భరిస్తున్న మీకు ధన్యవాదాలు. ఇంకా నన్ను జీవిత కాలం భరించాలి అంటూ" తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. మేఘన నటించిన "శశిరేఖ పరిణయం" సీరియల్ స్టార్ మాలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మేఘన లోకేష్ వాళ్ళ నాన్న ఒక ఇంజినీర్. వాళ్ళ అమ్మ ప్రొఫెసర్. మేఘన కన్నడ అమ్మాయే ఐనా తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతుంది. బాగా అల్లరి కూడా చేస్తుంది.
మేఘన టీవీ సీరియల్స్ తో పాటు కొన్ని షాట్ ఫిలిమ్స్, మూవీస్ లో నటించింది. ఎమోషన్, బ్యూటిఫుల్ లైఫ్ అనే షాట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. కన్నడలో దేవి, పవిత్ర బంధన, పురుషోత్తమ అనే టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేసింది మేఘన. డాన్స్ జోడి డాన్స్ కి మెంటార్ గా కూడా వ్యవహరించింది. అలాగే 2017 లో ఇదే మా ప్రేమకథ, 2018 లో అమీర్ పేట టు అమెరికా అనే రెండు తెలుగు మూవీస్ లో నటించింది కూడా. ఇక ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ యానివర్సరీని పురస్కరించుకుని నెటిజన్స్ విషెస్ చెప్తున్నారు. పెళ్లిరోజు సందర్భంగా థాయిలాండ్ లోని ఫి ఫి ఐలాండ్స్ లో భర్తతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది మేఘన లోకేష్. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.