English | Telugu

అక్కడ షో మానేసి ఇక్కడ స్టార్ మాలో ఎంట్రీ...పల్లవితో ముచ్చట్లు, డాన్స్ లు  

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అందులోనూ ఇమ్మానుయేల్ - పల్లవి ఎపిసోడ్ ఫుల్ జోష్ తో సాగింది. హోలీ స్పెషల్ ప్రోగ్రాంగా ప్రసారమైన ఈ ఎపిసోడ్ లో ఒక్కొక్కరి మీద రంగులు వేసుకున్నారు లేదు పూసుకున్నారు. ఈ ఎపిసోడ్ లో ఇమ్ము షో మొత్తాన్ని కబ్జా చేయడానికి ట్రై చేసాడు. ఐతే ఇమ్ముని స్పెషల్ గా ట్రీట్ చేసింది శ్రీముఖి. "ఇమ్ము నీతో నేను ఫ్రెష్ గా మాట్లాడాలి. ఏంటి అక్కడ షోలో మానేసావని తెలిసింది..వెల్కమ్ టు స్టార్ మా..ఇక్కడ చేస్తున్నావంటే అక్కడ మానేసినట్టే కదా. ఈ ఛానెల్ లోకి వచ్చావ్. అంటే ఇక నీకు రంగులే " అని చెప్తూ ఇన్వైట్ చేసింది. ఆ మాటలకు షాకయ్యాడు ఇమ్ము.

ఐతే షోలో ఉన్న ఐదుగురు అమ్మాయిల్లో పల్లవి అంటే ఇష్టం అని చెప్పేసరికి "పెళ్ళెప్పుడు..అసలే జుట్టు మొత్తం ఊడిపోతోంది" అని అడిగింది శ్రీముఖి. పెళ్లి త్వరలో ఈ స్టేజి మీదనే జరుగుతుంది అని చెప్పాడు ఇమ్ము. ఇక రోహిణి బాగా చూసుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చింది అంటూ చెప్పాడు ఇమ్ము. ఇక సాంగ్స్ టాస్క్ లో గెలిచినందుకు యాదమ్మ రాజు, ఇమ్ముని వెళ్లి రంగులు పోయామని చెప్పేసరికి రాజు వెళ్లి పల్లవి బుగ్గ మీద రంగు పూశాడు. దాంతో ఇమ్ముకి ఫుల్ కోపం వచ్చేసింది. రాజు, ఇమ్ము నా పిల్ల అంటే నా పిల్ల అంటూ అర్జున్ రెడ్డిలా ఫీలవుతూ కాసేపు అరుచుకున్నారు. "పల్లవి నీ కోసం అన్నీ మానేసి వచ్చా ఇదన్నా ప్లీజ్ ..చూసేవాళ్ళందరికీ వీడికి అక్కడ బానే ఉంది అని అనుకోవాలి కదా" అన్నాడు. ఇమ్ము తన బుగ్గకు రంగు రాసుకుని పల్లవితో డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.