సీఏ పాసవ్వాలంటే ఫొటో పంపాలంటూ విజయశాంతికి ఉత్తరం రాసిన అభిమాని!
హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించినా అభిమానులకు ఒరిగేదేమీ ఉండదు. అయినా తాము ఆరాధించే తారలను వారు ఆరాధిస్తూ, ఆత్మీయత కురిపిస్తూ, తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా పరిగణిస్తూ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. అభిమానుల అంతరంగం అంచనా వెయ్యడానికి వీలు కానిది, వెలకట్టడానికి వీలు లేనిది. తమ అభిమాన హీరోలను అన్నయ్యా అనీ, హీరోయిన్లను అక్కయ్యా అని సంబోధిస్తూ ఒకప్పుడు