భవానికి ఎదురుతిరిగిన కృష్ణ.. అసలేం జరిగిందంటే!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 101 లో.. మురారికి కృష్ణ పానీపూరి తినిపిస్తుండగా.. ముకుంద వచ్చి ఆపుతుంది. "నువ్వు ఏంటిక్కడ?" అని కృష్ణ అడిగితే, పని మీద వచ్చానని చెప్తుంది. కొద్దిసేపు మాట్లాడుకొని కృష్ణ, మురారిలు ఒక కార్ లో, ముకుంద వేరే కార్ లో వెళ్తారు. అందరూ ఒకేసారి ఇంటికి చేరుకొని ఇంట్లోకి వెళ్తారు.