Read more!

English | Telugu

సోమేష్, సుదర్శన్ మాస్టర్ల మధ్య మాటల యుద్ధం.. అసలేం జరిగింది?

ఢీ ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ప్రతీ వారం ఏదో ఒక కాంట్రవర్సితో ఎంటర్టైన్ చేస్తోంది. ఒక టీమ్ కి పోటీగా మరొక టీమ్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేస్తూ అలరిస్తున్నాయి. ఈ షో మధ్య మధ్యలో హైపర్ ఆది కామెడీ కొంచెం రిలీఫ్ అని చెప్పొచ్చు. ఐతే ఇప్పుడు ఆయనతో పాటు ఓల్డ్ కంటెస్టెంట్ పండు కూడా జతకట్టాడు. పండు కామెడీ కూడా పీక్స్ లో ఉంటోంది. ఆడియన్స్ కూడా పండు కామెడీని ఇష్టపడుతున్నారన్న విషయం కామెంట్స్ చూస్తుంటే అర్ధమవుతోంది. 

ఐతే ఈ షో ఈవారం ఎక్స్-కంటెస్టెంట్స్ థీమ్ గా రాబోతోంది. ఎక్స్ కంటెస్టెంట్స్  వచ్చి ఇందులో డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేసి ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ లో చెర్రీ అనే ఒక కంటెస్టెంట్ "ఏదో ఒక రాగం వింటున్నా" అనే సాంగ్ కి "నాన్న" మూవీలో విక్రమ్ రోల్ లా యాక్ట్ చేస్తూ డాన్స్ చేసాడు. ఐతే ఇందులో విక్రమ్ కి డాన్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. జస్ట్ ఎక్స్ ప్రెషన్స్, సింపుల్ స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడి కంటెస్టెంట్ కూడా అలాగే చేసాడు. ఆ డాన్స్ పెర్ఫార్మ్ చేసాక "ఇది నాకు డాన్స్ పెర్ఫార్మెన్స్ లా అనిపించలేదు" అని సుదర్శన్ మాస్టర్ అనేసరికి "గ్రూప్ లో సైడ్ డాన్సర్ గా పెట్టలేము కదా చెర్రీని" అని సోమేష్ మాస్టర్ కూడా గట్టిగానే ఆన్సర్ చేసాడు. "అప్పుడు చెర్రీని హైలైట్ చేసినప్పుడు గ్రూప్ లో ఒక్కో అబ్బాయిని కూడా హైలైట్ చేయొచ్చు కదా" అని సుదర్శన్ మాస్టర్ మళ్ళీ ఒక కౌంటర్ వేసాడు. "కానీ ఏదో చెప్పాలని ఏదో చెప్పకూడదు" అంటూ రివర్స్ లో ఫైర్ అయ్యాడు సోమేష్ మాస్టర్. "తీసుకోవాలనుకుంటే తీసుకోండి లేదంటే వదిలేయండి" అన్నాడు సీరియస్ గా సుదర్శన్ మాస్టర్. ఆ మాటలకూ శేఖర్ మాస్టర్ షాకయ్యాడు. 

ఇక నెటిజన్స్ కూడా సుదర్శన్ మాస్టర్ మీద ఫైర్ అవుతున్నారు. "సుదర్శన్ మాస్టర్ ముందు మీది చూసుకోండి అందరినీ ఎత్తి చూపడం కాదు. ఐనా మీరు చేసే కొరియోగ్రఫీ ఏమైనా బాగుందా..? సీజన్ మొదట్లోనే మీ కంటెస్టెంట్ రాహుల్ పైన సింపతి క్రియేట్ చేశారు. అందుకే మీకు మార్కులు మంచిగా ఇవ్వకపోతే బాగోదని ఇస్తున్నారు. మాటలు తగ్గించి మంచిగా డాన్స్ చేయించండి. ఒకరు కష్టపడితే అందరి దగ్గర అభినందనలు మాత్రం మీరు పొందుతారు. ఇది మీకు కరెక్ట్ కాదు" అని గట్టిగా కౌంటర్ వేశారు. ఇంతకు ఈ షోలో ఏం జరిగింది. వీళ్ళ మధ్య మొదలైన మాటల యుద్దానికి తెర పడిందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.