Read more!

English | Telugu

కొత్తగా పెళ్లయింది కదా.. సరదాలు ఉంటాయిలే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-100 లో.. నందు గురించి కృష్ణ ఆలోచిస్తుంది. "ఇంట్లో అందరూ నందుకి గతం గుర్తు రాకుండా ఉండే టాబ్లెట్స్ ఎందుకు వాడుతున్నారు" అని కృష్ణ అనుకుంటుంది. మరోవైపు మురారి స్టేషన్ కి వెళ్ళకుండా తన ఫ్రెండ్ గోపి దగ్గరికి వెళ్ళి బాధను చెప్పుకుంటాడు. "ఇంటికెళ్ళాలి అనిపించట్లేదు.. ఒక్క కృష్ణ కోసమే వెళ్తున్నాను.. ముకుందని చూస్తే భయమేస్తుంది" అని గోపీతో మురారి చెప్తాడు. "ముకుందని చూస్తే ఎందుకు భయమేస్తుంది? ముకుంద నిన్ను సిన్సియర్ గా లవ్ చేసింది. అందుకే నిన్ను మర్చిపోలేకపోతుంది.. కాని నువ్వే స్వార్థంతో ఆలోచిస్తున్నావు.. నిన్ను ఒక ఫ్రెండ్ గా సపోర్ట్ చెయ్యలేను" అని గోపి అంటాడు. "నువ్వు అలా అంటే నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తున్నట్లు ఉంది గోపి.. నేను ఏం చెయ్యాలి" అంటూ మురారి బాధపడతాడు.

మరోవైపు భవాని దగ్గరికి ఈశ్వర్, ప్రసాద్ వచ్చి మాట్లాడుతుంటారు. "వదిన నందు గురించే ఆలోచిస్తున్నావా? కృష్ణ తన సీనియర్ డాక్టర్ తో మందులు రాయించుకొని తీసుకొస్తా అంటుంది" అని ఈశ్వర్ చెప్తాడు. ఆ డాక్టర్ నందుని చూడకుండా ఎలా మందులు రాస్తాడని భవాని అడుగుతుంది‌. నందుకి గతం గుర్తొస్తే మన ఇంటి పరువు ఏమవుతుంది.. కృష్ణ ని ఓ కంట కనిపెడుతుండాలని ముగ్గురు అనుకుంటారు.

మురారి గురించి ముకుంద ఆలోచిస్తుంటుంది. "నన్ను ఇంతలా అసహ్యించుకుంటున్నాడు. నేను వెంటనే మురారిని చూడాలి" అని భావించిన ముకుంద స్టేషన్ కి ఫోన్ చేస్తుంది. స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేసి.. "సర్ ఈ రోజు లీవ్ లో ఉన్నాడు మేడమ్" అని చెప్పగానే.. ముకుంద ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత బయటికి వెళ్తుంది. మరోవైపు నందు కోసం గౌతమ్ రాసిన మందులు తీసుకొని.. "నందు గురించి ఏసీపి సర్ కి చెప్పాలా" అని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత మురారికి ఫోన్ చేస్తుంది. కాలేజీకి వస్తున్నారా అని అడిగేసరికి.. పక్కనే ఉన్నానని చెప్పి కాసేపటికి కృష్ణ దగ్గరికి వస్తాడు మురారి. ఆ తర్వాత ఇద్దరు కార్ లో వెళ్తుంటారు. నందు గురించి కృష్ణ చెప్పాలనుకుంటుంది కాని మురారిని చూడగానే డల్ గా కనిపించేసరికి సర్ మూడ్ బాలేదని చెప్పదు. ఇక మధ్యలో కార్ ఆగిపోతుంది. అక్కడ పక్కనే ఉన్న పానీపూరి బండి చూసి ఇద్దరూ తినడానికి వెళ్తారు. మురారికి కృష్ణ పానీపూరి తినిపిస్తుండగా.. ముకుంద వచ్చి ఆపుతుంది. "ముకుంద.. నువ్వు ఏంటి ఇక్కడ" అని కృష్ణ అడిగేసరికి.. పని మీద వచ్చానని ముకుంద చెప్తుంది. మీరు ఇలా తినడం ఇంట్లో ఎవరికీ చెప్పనులే.. కొత్తగా పెళ్ళి అయింది కదా.. మీకు సరదాలు ఉంటాయని ముకుంద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.