Read more!

English | Telugu

మురారి మాటలకు మేడ మీద నుంచి దూకబోయిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-102 లో.. నందు బాధ్యతలన్ని చూసుకోమని ముకుందతో చెప్తుంది భవాని. అలా భవాని చెప్పడంతో.. "ఎవరైతే ఏంటి చూసుకోవడానికి నందుకి బాగవడం మనకు ముఖ్యం" అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత తలనొప్పిగా ఉందని కృష్ణ కిచెన్ లోకి వెళ్ళి టీ పెట్టుకొని తాగుతుండగా.. రేవతి వెళ్ళి.. "నువ్వు ఎంత మంచి కోడలివి. అప్పుడే కోపంగా ఉంటావ్. అప్పుడే మాములు అయిపోతావ్. అందరి గురించి ఆలోచిస్తావ్" అని కృష్ణని పొగుడుతుంది. ఇదంతా మా నాన్న దగ్గర నుండి వచ్చిందని కృష్ణ చెప్తుంది.

మరోవైపు బాల్కనీలో ముకుంద కోసం మురారి ఎదురు చేస్తుంటాడు. ఇంతలో ముకుంద వచ్చి.. "ఏంటి మురారి ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని చూసాను.. ఇన్ని రోజులకి పిలిచావ్.. ఏం మాట్లాడాలి మన ప్రేమ గురించా" అని ముకుంద అంటుంది. ప్రేమ అంటే ఏంటి ముకుంద అని అడుగుతాడు మురారి. ఇదేం ప్రశ్న అని ముకుంద అంటుంది. "నువ్వు చేసే ఏ పని కూడా ప్రేమ కి సంబంధించినది కాదు. నువ్వు ఒక ఉన్మాదిలాగా, కసాయి దానిలాగా నా వెంటపడుతున్నావ్. నిలదీస్తున్నావ్.. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. నువ్వు ఆ రోజు నేను కనబడితేనే అలా మాట్లాడావ్.. లేకుంటే హ్యాపీగానే పెళ్ళి చేదుకునేదానివి" అని మురారి అంటాడు. "నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడినా భరిస్తాను.. నా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడితే భరించలేను. ఆ రోజు నువ్వు ఎదురుపడకపోయుంటే పెళ్ళిపీటల మీదనే చచ్చిపోయేదాన్ని" అని ముకుంద అంటుంది. మరి ఏం చేస్తావ్ అని మురారి అనడంతో.. ముకుంద మేడ మీద నుండి దూకబోతుంటే మురారి ఆమె చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు. నీ ప్రేమని నమ్ముతున్నానని మురారి చెప్తాడు. "దయచేసి ఒకటి గుర్తు పెట్టుకో.. మనం ఎప్పటికీ కలవము" అని మురారి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత మురారి గదిలోకి వెళ్ళేసరికి కృష్ణ తన ప్రశ్నలతో మురారికి చిరాకు తెప్పిస్తుంది. దాంతో ముకుందపై కోపాన్ని కృష్ణ మీద చూపించి గట్టిగా అరుస్తాడు. ఇక కృష్ణ ఫీల్  అయి ఉంటుందని మురారి సరదాగా ఆటపట్టిస్తాడు. కృష్ణ కూల్ అయ్యాక ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.