Read more!

English | Telugu

రాజ్ పక్కన కావ్యని చూసి షాకైన అపర్ణ.. ఆమెని ఇంటికోడలిగా అంగీకరిస్తుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ రోజు రోజుకి ఉత్కంఠభరితంగా మారుతూ వస్తోంది. ఒకరంటే ఒకరికి అసలు ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులకు బ్రహ్మముడి పడింది. దీంతో తదుపరి ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. కాగా ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -39 లో కావ్యకు అప్పగింతలు చేసి కనకం కుటుంబం రాజ్ తో పంపిస్తారు. కావ్య వెళ్ళిపోయిన వెంటనే అప్పు ఒక బ్యాగ్ తీసుకొచ్చి "అక్క ఈ బ్యాగ్ మర్చిపోయింది. ఈ బ్యాగ్ అంటే తనకి ఇష్టం. ఎలాగైనా ఇవ్వాలి" అని కావ్య, రాజ్ లు వెళ్తున్న కార్ వెంబడి పరుగెత్తుతుండగా.. రాజ్ కార్ అద్దంలో చూసి కార్ ఆపమంటాడు. ఇక కార్ ఆగిన తర్వాత అప్పు బ్యాగ్ తీసుకొని వచ్చి.. "అక్క బ్యాగ్ మర్చిపోయావ్" అని కావ్యకి ఇస్తుంది. "బ్యాగ్ కోసం ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చావా" అని కావ్య అంటుంది. "మా అక్క దేవత జాగ్రత్తగా చూసుకోండి" అని రాజ్ తో అనగానే.. "మేము వెళ్ళేది అడవికి కాదు అయోధ్యకే" అని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్, కావ్యలు బయల్దేరి వెళ్తారు.

రాజ్, కావ్యల కంటే ముందే రాజ్ వాళ్ళ కుటుంబసభ్యులంతా వారింటికి వెళ్తారు. ఇక ఇంట్లో ఉన్న రాజ్ తల్లి అపర్ణ "అక్కడే ఉండండి హారతి ఇస్తాను" అన్నా పట్టించుకోకుండా అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. "ఏమైంది అలా ఉన్నారు.. రాజ్, స్వప్నలు ఎక్కడ? వస్తున్నారా?" అని అడిగినా ఎవరూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు. ఇంతలో రాజ్-కావ్య కలిసి కార్ లో వస్తారు. అలా రాజ్ కారు వచ్చి ఆగడంతో.. రాజ్ వాళ్ళు వచ్చారంటూ.. సంతోషంతో అపర్ణ హారతి పట్టుకొని వెళుతుంది. రాజ్ పక్కన స్వప్న కనిపించకపోవడంతో అటు ఇటు చూసి పక్కన ఉన్న కళ్యాణ్ ని..‌ మీ వదిన ఎక్కడ అని అడుగుతుంది అపర్ణ. ఆ తర్వాత కళ్యాణ్ వెనకాలే ఉన్న కావ్యని చూసి షాక్ అవుతుంది. ఏంటి ఈ అమ్మాయి ఉందని అపర్ణ అడుగుతుంది. "స్వప్నకు పెళ్ళి ఇష్టం లేదని లెటర్ రాసి పారిపోయింది. ఈ అమ్మాయి కూడా కనకం కూతురే. వాళ్ళు మనకు చెప్పినవన్నీ అబద్దాలే. చేసినవన్నీ మోసాలే" అని రాజ్ తన తల్లితో చెప్తాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఈ అమ్మాయిని ఎలా చేసుకున్నావ్? అని కోప్పడుతుంది అపర్ణ. 

"మీరంతా అక్కడ ఏం చేసారు? నేను అక్కడ ఉండి ఉంటే ఈ పెళ్ళి జరగనిచ్చేదాన్నే కాదు" అని కుటుంబసభ్యులతో అపర్ణ అంటుంది. అక్కడ మనకు సపోర్ట్ గా మీడియా వాళ్ళు లేరు.. మనమేదో తప్పు చేస్తున్నామని అంతా అనుకుంటున్నారని అపర్ణకి అక్కడ జరిగిందంత చెప్తారు. అలా చెప్పేసరికి అపర్ణ కూల్ అయి.. రాజ్, కావ్యల దగ్గరికి వస్తుంది. కావ్య అంటే ఇష్టం లేని అపర్ణ ఆమెని ఇంటి కోడలిగా అంగీకరిస్తుందా? ఇంట్లోకి రానిస్తుందా? దుగ్గిరాల ఫ్యామిలీని కావ్య ఎలా ఎదుర్కొంటుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.