Read more!

English | Telugu

ఇంత దరిద్రమైన స్కిట్ ని నేనెప్పుడూ చూడలేదు!

జబర్దస్త్ కామెడీ షోలో ప్రతీ వారం ఏదో ఒక స్కిట్ మాత్రం సంథింగ్ డిఫరెంట్ గా ఉంటోంది. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ముందుగా రాఘవ తన స్కిట్ తో ఎంట్రీ ఇచ్చాడు "ఈ రోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య భయం. ఫస్ట్ స్కిట్ చేయబోయే టీమ్ లీడర్ కి భయం.. ఈ స్కిట్ చూసి జడ్జెస్ కి భయం.. మళ్ళీ పాత పంచులే వస్తాయేమో అని" రాఘవ అనేసరికి "వస్తాయేమో ఏమిటి వస్తున్నాయి" అని ఇంద్రజ కౌంటర్ వేసింది. "ఎవరికైనా భయం గుండెల్లో గూడు కట్టుకుంటుంది.. కానీ నాకు భయం బంగళా కట్టేసుకుంది" అన్నాడు రాఘవ. ఇలా ఈ స్కిట్ సాగితే ఫైనల్ గా నూకరాజు టీమ్ ఎంట్రీ ఇచ్చి స్కిట్ పెర్ఫార్మ్ చేసింది.

నూకరాజు టీమ్ మొత్తం రివర్స్ ఫామిలీ ఎలా ఉంటుందో స్కిట్ చేసి చూపించారు. నూకరాజు లేడీ గెటప్ లో ఇల్లు ఊడుస్తూ ఉంటాడు "పాల అబ్బాయి వచ్చి ఇంట్లో అందరూ ఆరోగ్యంతో ఉన్నారా" అని అడిగేసరికి " దేవుడి దయ వలన అందరికీ ఆరోగ్యాలు పోయాయి. నిన్నే రీసెంట్ గా మా ఆయనకు ఒక కాలు పడిపోయింది. దేవుడికి మొక్కుకుంటే రెండు కాళ్ళు పడిపోయాయి" అని చెప్పేసరికి ఇంద్రజ ఒక్కసారి షాకైపోయి చూసింది. అసలేం మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఒక అర్థంకాని ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది. ఇక ఈ స్కిట్ అయ్యాక  హోస్ట్ సౌమ్య వచ్చి ఇది రివర్స్ స్కిట్ కాబట్టి నేను కూడా రివర్స్ లోనే అడుగుతాను "ఈ దరిద్రమైన స్కిట్ ఎలా ఉంది" అని జడ్జెస్ ని అడిగేసరికి "నేను కూడా ఇంత దరిద్రమైన స్కిట్ ఇంతవరకు చూడలేదు" అని కృష్ణ భగవాన్ పంచ్ వేశారు. దాంతో అందరూ నవ్వేశారు. అలాగే రాఘవ, శాంతి స్వరూప్ వేసిన స్కిట్ ప్రోమో కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది.