Read more!

English | Telugu

నెటిజన్ అలా అడిగేసరికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన రీతూ!

రీతూ చౌదరి జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ రీతూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తుంది, రెగ్యులర్ గా రీల్స్ అప్ డేట్ చేస్తుంది.. ఎన్నో ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అవన్నీ బాగా వైరల్ అవుతుంటాయి. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు.. లాంటి సీరియల్స్ లోనూ నటించి మెప్పించిన రీతూ చౌదరికి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎక్కువే. లేడీ కమెడియన్‌గా సత్తా చాటుకుంటూ.. సోషల్ మీడియాలో తన అందంతో అట్రాక్ట్  చేస్తోంది ఈ యంగ్ బ్యూటీ. జబర్దస్త్ కమెడియన్‌ అజార్‌తో ప్రేమలో ఉన్నట్లుగా ఎలివేట్ అయ్యే ఎన్నో స్కిట్స్ కూడా చేశారు. కొంత కాలం క్రితం ఒక కార్ కూడా కొనుక్కుంది రీతూ. 

ఐతే రీసెంట్ గా ఒక నెటిజన్ రీతుని సోషల్ మీడియాలో అప్పు అడిగాడు. "నాకు ఒక లక్ష రూపాయలు కావాలి" అని అడిగేసరికి "నా జీవితంలో అప్పు ఇస్తే గనక అప్పు తీసుకున్నవాళ్లకు మంచి జరగదట" అని రిప్లై ఇచ్చి నోరుమూయించింది. అలాగే "మనీ ఉంటే ఏదైనా చేయొచ్చా" అని మరో నెటిజన్ అడిగారు. "డబ్బు కేవలం అవసరాల కోసం మాత్రం అదేమీ సంతోషాన్ని ఇవ్వదు...చావు రాకుండా ఆపదు...ఇలా చెప్తూ పొతే బోల్డు ఉన్నాయి. డబ్బుకి కాదు మనుషులకు విలువ ఇవ్వండి" అని హితోక్తి చెప్పింది రీతూ చౌదరి. "ప్రెజంట్ ఎక్కడ ఉన్నారు" అని మరో నెటిజన్ అడిగేసరికి "హాస్పిటల్ కి వచ్చాను కొన్ని టెస్ట్స్ కోసం" అంటూ రిప్లై ఇచ్చింది. "ఇంటర్ లో టోటల్ మార్క్స్ ఎంత" అని అడిగేసరికి " సారి రా నాన్న నాకు గుర్తులేదు..నేను యావరేజ్ స్టూడెంట్ నే" అని చెప్పింది.