English | Telugu

చిట్టిముత్యాలు.. రొమాన్స్ విత్ రైస్!

"ఉలవచారు, రాజుగారి తోట, కూచిపూడి పలావ్, రాజుగారి కోడి పలావ్, మారేడుమిల్లి" వంటి రెస్టారెంట్స్ తో ఫుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న కూచిపూడి వెంకట్ తాజాగా 'చిట్టిముత్యాలు' పేరుతో మరో రెస్టారెంట్ కు శ్రీకారం చుట్టారు. స్వతహాగా ఆయన దర్శకుడు కావడంతో దీనికి "రొమాన్స్ విత్ రైస్" అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

హైదరాబాద్, మాదాపూర్ లోని ఇమేజ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన "చిట్టిముత్యాలు" (రొమాన్స్ విత్ రైస్) రెస్టారెంట్ ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, టి.జి. విశ్వప్రసాద్, ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి ప్రారంభించారు. దిల్ రాజు రిబ్బన్ కట్ చేయగా, హరీష్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనిల్ రావిపూడి మెను లాంచ్ చేయగా, విశ్వప్రసాద్ క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశారు.

ఇంతటి అత్యద్భత ఆహ్లాదకర వాతావరణం సృష్టించి, ఎంత తిన్నా తనివి తీరని నోరూరించే వంటకాలతో భోజనప్రియుల మనసులు దోచుకోవడం కూచిపూడి వెంకట్ కు మాత్రమే సాధ్యమని దిల్ రాజు, అనిల్ రావిపూడి అన్నారు. "చిట్టిముత్యాలు" హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీలో ఓ మణిహారంలా భాసిల్లడం ఖాయమని టి.జి.విశ్వప్రసాద్, హరీష్ శంకర్ ప్రశంసించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రెస్టారెంట్స్ ఏర్పాటు చేయడం తనకు ప్యాషన్ అని చెప్పిన కూచిపూడి వెంకట్.. "చిట్టిముత్యాలు"తో ఒక గొప్ప భోజనానుభూతిని పంచేందుకు చాలా నెలలు శ్రమించామని తెలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .