English | Telugu

'అదుర్స్-2' స్టోరీ రెడీ.. ఈసారి అమెరికాలో చారి, భట్టు కామెడీ!

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం కామెడీ ఎంటర్టైనర్ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే సినిమా 'అదుర్స్'. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2010 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. భట్టు(బ్రహ్మానందం)తో కలిసి చారిగా ఎన్టీఆర్ పంచిన వినోదానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఈ చిత్రాన్ని పదే పదే చూసేవారు ఎందరో ఉన్నారు. సోషల్ మీడియా మీమ్స్ లో సైతం ఈ మూవీ టెంప్లేట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి.

'అదుర్స్'కి సీక్వెల్ చేయాలనే డిమాండ్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. వినాయక్ సైతం 'అదుర్స్-2' చేసే ఆలోచన ఉందని పలు సందర్భాల్లో చెప్పారు. ఇక తాజాగా రచయిత కోన వెంకట్ అయితే అదుర్స్-2 స్టోరీ లైన్ కూడా రెడీగా ఉందని చెప్పి సర్ ప్రైజ్ చేశారు. రీసెంట్ తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదుర్స్-2 గురించి కోన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"అమెరికాలో అదుర్స్ అని నేను సీక్వెల్ కి ఎప్పుడో కథ అనుకున్నాను. తన గురువుతో కలిసి చారి అమెరికా వెళ్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మంచి ట్విస్ట్ లు, టర్న్ లతో ఉంటుంది. తారక్ ఓకే అంటే మూడు నెలల్లో స్క్రిప్ట్ రెడీ చేసి షూట్ కి వెళ్లిపోవడమే. కానీ ఇప్పుడు తారక్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. పైగా పలు సినిమాలు కమిటై ఉన్నాడు. అయితే తారక్ ఫ్యాన్స్ నచ్చే టాప్-5 లో ఫిలిమ్స్ లో అదుర్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యాన్స్ కూడా సీక్వెల్ కోరుకుంటున్నారు. అన్నీ కుదిరి త్వరలోనే సీక్వెల్ రావాలని కోరుకుందాం. దేనికైనా టైం రావాలి. అప్పుడు నేను అదుర్స్ లైన్ సరదాగా మాట్లాడుతూ చెప్పా. తారక్ కి బాగా నచ్చి, కొత్తగా ఉంటుంది చేద్దాం అన్నాడు. అలాగే అదుర్స్-2 కి అన్నీ కలిసొచ్చి అలాంటి మూమెంట్ రావాలి" అన్నారు కోన వెంకట్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.