English | Telugu
క్యాన్సర్ సోకిన పిల్లల కోసం నాగ చైతన్య
Updated : Nov 16, 2023
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొదటి నుంచి కూడా ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా, ఎవర్ని విమర్శించకుండా తమ సినిమాలు తాము చేసుకుంటే వెళ్లే హీరోలు అక్కినేని హీరోలు. నాగేశ్వరావు దగ్గరనుంచి నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా అందరు అదే సిస్టం తో ఉంటారు. అలాగే కుదిరినప్పుడల్లా పది మందికి సహాయం చేస్తు తాము అండగా ఉన్నామనే భరోసాని కూడా కలిపిస్తారు. తాజాగా నాగ చైతన్య క్యాన్సర్ తో బాధపడుతున్న కొంత మంది పిల్లలని కలిసి తాను ఉన్నాననే భరోసా ని ఇచ్చాడు.
నాగ చైతన్య ఈ రోజు క్యాన్సర్ తో బాధపడుతున్న కొంత మంది పిలల్లని కలిసాడు. హైదరాబాద్ లో ఉన్న ఎస్.టి జుడిస్ అనే చిన్నపిల్లల క్యాన్సర్ సంస్థ కి వెళ్లిన చైతన్య పిల్లలతో మాట్లాడి మీకు తప్పకుండా క్యాన్సర్ నయమవుతుందని ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పాడు. పిల్లలకి రకరకాల గిఫ్ట్ లు ఇచ్చి మీకు నేను ఉన్నానని చెప్పడంతో పాటు పిల్లలతో కలిసి మ్యూజికల్ చైర్ గేమ్ మరియు ఇతర గేమ్స్ ని ఆడాడు. ఆ తర్వాత సంస్థ ప్రతినిధులతో పిల్లలకి ఎలాంటి సహాయం కావాలన్నా ఎప్పుడు ముందుంటానని కూడా చైతన్య చెప్పాడు.
నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. త్వరలోనే షూట్ కి వెళ్ళబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో తాను పోషించే మత్స్యకారుడి క్యారక్టర్ కోసం నిజ జీవిత మత్స్యకారులని కూడా చైతన్య కలిసి చాలా విషయాలని తెలుసుకున్నాడు. ఆ క్యారెక్టర్ ప్రిపరేషన్ లో ఎంతో బిజీ గా ఉన్న చైతన్య ఇప్పుడు క్యాన్సర్ సోకిన పిల్లలని కలిసి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం మీద పలువురు చైతన్య ని అభినందిస్తున్నారు.