English | Telugu
నిఖిల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..డాడీ గా ప్రమోషన్ పొందిన నిఖిల్
Updated : Nov 17, 2023
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు సినిమారంగానికి పరిచయమయిన నటుడు నిఖిల్. కొన్ని పరాజయాల తర్వాత కార్తికేయ 2 అనే సినిమాతో స్టార్ స్టేటస్ ని అందుకొని పాన్ ఇండియా రేంజ్ హీరో స్థాయికి నిఖిల్ ఎదిగాడు. ప్రస్తుతం నిఖిల్ కి సంబంధించిన ఒక వార్త ఆయన అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.
నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. నిఖిల్ భార్య పల్లవి వర్మ ప్రస్తుతం గర్భవతి. డాక్టర్ గా పనిచేస్తున్న పల్లవి వర్మ ఇటీవలే చెకప్ చేయించుకోగా తల్లి కాబోతుందని తెలిసింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకి తెలియచేసాడు. దీంతో తమ అభిమాన హీరో తండ్రి కాబోతున్నాడని తెలిసి ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తు సోషల్ మీడియా ద్వారా నిఖిల్ కి అభినందనలు తెలియచేస్తున్నారు.
నిఖిల్ తాజాగా స్వయం భూ అనే ఒక పీరియాడిక్ మూవీని చేస్తున్నాడు. నిఖిల్ కెరీర్ లోనే హై బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీలోని తన క్యారక్టర్ కోసం నిఖిల్ ప్రస్తుతం కత్తి విన్యాసాలు,గుర్రపు స్వారీలు నేర్చుకుంటున్నాడు. త్వరలోనే షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ మూవీ మీద నిఖిల్ అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి.