English | Telugu
అనిల్ రావిపూడి పొలిటికల్ ఎంట్రీ.. నా గెలుపు థియేటర్‌లో కాదు అసెంబ్లీలో!
Updated : Nov 17, 2023
అనిల్ రావిపూడి... సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్. పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు డిఫరెంట్ జోనర్స్‌లో సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. హీరో ఎవరైనా తన మార్క్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలో అందె వేసిన చెయ్యి. అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కామెడీ షోలలో, ఇంటర్వ్యూలలో తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే అనిల్‌లో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడన్నది నిజం. ‘ఆహా’ వస్తున్న ఓ కామెడీ షోకి అనిల్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఒక వీడియో షేర్ చేసాడు. పొలిటికల్ లీడర్ గెటప్‌లో కుర్చీలో కూర్చున్న అనిల్ రావిపూడి ‘ఇప్పటి వరకు సినిమాలు చేసి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేశాను. మీరూ ఎంటర్‌టైన్ అయ్యారు. గెలిచేది నేనైనా గెలిపించేది మీరు. కానీ, ఈసారి నా గెలుపు థియేటర్‌లో కాదు ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌లో ప్లాన్ చేసుకుంటున్నాను. మీరు పంపిస్తారుగా!. అలాగే ఒక పార్టీ పెట్టబోతున్నాను. మన పార్టీ పేరేంటో, మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరో మొత్తం ఇన్‌ఫర్మేషన్‌తో త్వరలోనే వస్తా’ అనేది ఆ వీడియోలోని సారాంశం. సడన్‌గా అనిల్ నుంచి ఈ వీడియో రావడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఏదైనా ప్రోగ్రామ్‌కి ప్రోమోనా? లేక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఏదైనా సినిమా చేస్తున్నాడా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఇది ‘ఆహా’లో వచ్చే ఓ పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రోమో అని కొందరు, అనిల్ రావిపూడి హీరోగా పొలిటికల్ సెటైరికల్ మూవీ ఒకటి రాబోతోందని, ఆహా ఒటీటీ దీనిని నిర్మిస్తోందని, దానికోసమే ఈ ప్రమోషన్ సెటప్ అని కొందరు అంటున్నారు. వీటిలో ఏది నిజం అనేది త్వరలోనే తెలుస్తుంది. ఒకవేళ అనిల్ రావిపూడి హీరోగా పొలిటికల్ సెటైరికల్ మూవీ చేయబోతున్నది నిజమే అయితే మనకి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. ఒకవేళ షో అయినా దానికి ఏమాత్రం లోటు ఉండదు.