ఆరు నెలలుగా పనిలేక ఖాళీగా.. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన చైతన్య!
సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూ, తమ సినిమాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం కోసం ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు. దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అలాగే కొందరు తమ పేరుతో యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి హీరోల పేరుతో ఇప్పటికే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో నాగ చైతన్య చేరాడు.