English | Telugu
'మంగళవారం'.. సగమే చూశారు.. సీక్వెల్ లో అసలు బొమ్మ చూస్తారు!
Updated : Nov 17, 2023
పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టీరియస్ థ్రిల్లర్ 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' తర్వాత పాయల్, అజయ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇందులో పాయల్ బోల్డ్ పాత్ర పోషించడంతో మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది. 'మంగళవారం' నేడు(నవంబర్ 17న) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండటం విశేషం.
మొదటి షో నుంచే 'మంగళవారం' పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా కాకపోయినా.. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా, మాస్ ఆడియన్స్ మెచ్చేలా ఉంది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండాఫ్ అదిరిపోయింది. ముఖ్యంగా చివరి 30 నిమిషాలలో వచ్చే ట్విస్ట్ లు వావ్ అనేలా ఉన్నాయి. ఇక సినిమా ఎండింగ్ లో ‘టు బి కంటిన్యూడ్’ అని వేసి, సినిమాకి రెండో భాగం కూడా ఉంటుందని దర్శకుడు చెప్పేశాడు. 'మంగళవారం'లో శృంగార కోరికలను అదుపు చేసుకోలేని బోల్డ్ పాత్రలో పాయల్ కనిపించింది. చివరిలో ఆమె పాత్రపై సింపతీ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. కొన్ని సన్నివేశాలు చాలా బోల్డ్ గా ఉన్నాయి. మొదటి భాగంలోనే ఇలా ఉంటే, రెండో భాగంలో ఇంకెంత బోల్డ్ ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.