English | Telugu
తెలంగాణ పోలీసుల అదుపులో యాంకర్ సుమ కొడుకు
Updated : Nov 18, 2023
డాక్టర్ అవుదామనుకొని యాక్టర్ అయిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది ఉంటారు. కానీ యాక్టర్ నుంచి యాంకర్ గా మారిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన అవకాశాన్ని పొందిన ఆ నటి, యాంకర్ ఎవరో కాదు సుమ కనకాల. తాజాగా సుమ కనకాల కొడుక్కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
సుమ కనకాల కొడుకు పేరు రోషన్ కనకాల. 2016 లో వచ్చిన నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన రోషన్,తాజాగా బబుల్ గమ్ అనే సినిమా ద్వారా పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా అతన్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారు. ఒక కారులో వెళ్తున్న అతన్ని తెలంగాణాలో ఉన్న ఎన్నికల కోడు దృష్ట్యా పోలీసులు కారుని చెక్ చెయ్యడానికి ఆపారు. దాంతో అతను నా వెహికిల్ ఎందుకు ఆపారని ప్రశ్నించడంతో విషయం చెప్పిన పోలీసులు కారు ని చెక్ చెయ్యాలంటే అతను ఒప్పుకోలేదు. ఆ తర్వాత పోలీసులు రోషన్ ని అదుపులోకి తీసుకొని కారులో ఉన్న సూట్ కేసులతో సహా స్టేషన్ కి తీసుకెళ్లారు.
కాకపోతే ఇక్కడే ఒక గమ్మత్తు ఉంది. రోషన్ కారుని పోలీసులు ఆపడం, రోషన్ ని, అతని దగ్గర ఉన్న సూట్ కేసులని తీసుకెళ్లడం వరకు నిజమే. కాకపోతే సూట్ కేసులని ఓపెన్ చేశాకే అసలు మ్యాటర్ తెలిసింది. సూట్ కేసుల్లో బబుల్ గమ్స్, జిలేబీలు ఉన్నాయి.బబుల్ గమ్ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఆ వీడియో చేసి యూట్యూబ్ లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కొంతమంది ఆ వీడియో చూసి నిజంగానే రోషన్ ని అరెస్ట్ చేసారని అనుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న రోషన్ ఆరెస్ట్ వార్తలపై సుమ కూడా స్పందించి అదంతా ఫ్రాంక్ వీడియో అని చెప్పింది.