English | Telugu
చిరంజీవి లేకుండానే 'మెగా 156' షూట్ స్టార్ట్!
Updated : Nov 17, 2023
మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాని 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ దసరా రోజున పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.
'మెగా 156' మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 23 నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. అయితే చిరంజీవి మాత్రం కాస్త ఆలస్యంగా షూట్ లో జాయిన్ అవ్వనున్నారట. కొద్దిరోజుల పాటు మెగాస్టార్ లేని ఇతర నటుల సన్నివేశాలను చిత్రీకరిస్తారట. డిసెంబర్ లో చిరు షూట్ లో జాయిన్ కానున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాకి 'విశ్వంభర' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు టాక్. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందనున్నఈ చిత్రంలో రానా దగ్గుబాటి విలన్ గా నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని ప్రచారం జరుగుతోంది.