English | Telugu

ఆరు నెలలుగా పనిలేక ఖాళీగా.. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన చైతన్య!

సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూ, తమ సినిమాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం కోసం ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు. దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అలాగే కొందరు తమ పేరుతో యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి హీరోల పేరుతో ఇప్పటికే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో నాగ చైతన్య చేరాడు.

తాజాగా నాగ చైతన్య తన పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. మొదటి వీడియోని కూడా అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలో సరదాగా మాట్లాడుతూనే తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు చైతన్య. "చాలాకాలం తర్వాత జుట్టు, గడ్డం పెంచారు.. ఎందుకు?" అని అడగ్గా.. "ఆరు నెలల నుంచి ఏ పని లేక ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. అందుకే పెంచాను" అంటూ మొదట సరదాగా సమాధానమిచ్చాడు చైతూ. ఆ తర్వాత చందు మొండేటి డైరెక్షన్ లో రూపొందుతోన్న 'NC 23' కోసం పెంచానని చెప్పాడు. అలాగే ఇటీవల ఫస్ట్ లుక్ ఫొటో షూట్ కూడా జరిగిందని, అవుట్ పుట్ అదిరిపోయిందని తెలిపాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.