English | Telugu

Karthika Deepam2 : కాశీకి జాబ్ లేదనే నిజం తెలుసుకున్న స్వప్న.. శివన్నారాయణ ఇంట్లో హోమం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -517 లో.... కాశీ ఆఫీస్ కి హడావిడిగా రెడీ అవుతాడు. కాశీ వెళ్తుంటే.. నీతో పాటు నేను కూడా వస్తాను.. నాకు మీ ఆఫీస్ పక్కన చిన్న పని ఉందని స్వప్న అంటుంది. వద్దని కాశీ అంటాడు. నాకు చాలా స్ట్రెస్ ఉంది.. వెళ్ళాలని లేదని కాశీ అంటాడు. జాబ్ చేసే వాళ్ళకి కదా స్ట్రెస్ నీకు ఎందుకని స్వప్న అనగానే కాశీ షాక్ అవుతాడు. నాకు తెలుసు నువ్వు జాబ్ చెయ్యట్లేదు.. ఇప్పుడు నిజం చెప్పమని తన తలపై చెయ్ పెట్టుకొని స్వప్న అడుగుతుంది.