English | Telugu

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.

Illu illalu pillalu : శ్రీవల్లిని ఇరికించిన ప్రేమ, నర్మద.. ప్రేమ ఎస్సై కావాలని ధీరజ్ తపన!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Ilu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -334 లో.....శ్రీవల్లి తన పుట్టింటికి వచ్చి ఇవన్నీ జరగడానికి కారణం మీరే.. అసలు నా భర్తతో సంతోషంగా కాపురం చెయ్యట్లేదు. ఎప్పుడు నిజం తెలుస్తుందోనని భయపడుతున్నానని శ్రీవల్లి అంటుంది. ఆ నర్మద, ప్రేమ మంచి వాళ్ళు కాబట్టే వాళ్ళు నిజం చెప్పకుండా ఆగారు.. వాళ్ళ జోలికి నువ్వు వెళ్లకుంటే వాళ్ళు కూడ నీ జోలికి రారు అమ్మ అని ఆనందరావు అంటాడు. చాల్లే చెప్పొచ్చావ్.. ఇప్పుడు మీ మావయ్య వాళ్ళపై కోపంగా ఉన్నాడు.. మనం అనుకున్నది జరుగుతుందని శ్రీవల్లికి భాగ్యం దైర్యం చెప్పి పంపిస్తుంది.  

Karthika Deepam2 : దీప కడుపులో బిడ్డ క్షేమం కోసం శివన్నారాయణ తపన.. తను ఒప్పుకుంటుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -533 లో... దశరథ్, సుమిత్ర కలిసి దీపని తన బిడ్డ అనుకొని పసుపు కుంకుమతో సారె తీసుకొని వచ్చి ఇస్తారు. దాంతో దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తీక్, దీప ఇద్దరు సుమిత్ర, దశరథ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పుడు మీకొక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాం.. ఇక దీప నువ్వు పనికి రానవసరం లేదు.. నువు జాగ్రత్తగా ఉండాలని సుమిత్ర అనగానే దీప షాక్ అవుతుంది. నీకు ఏమైనా అవసరం ఉంటే అన్ని మేమ్ తీసుకొని వస్తామని దశరథ్ చెప్తాడు.