English | Telugu
ఇంద్రజ, సుధీర్ మీద ఆది కౌంటర్స్...అమ్మాకొడుకులిద్దరే పోతారు అంటూ కామెంట్స్
Updated : Dec 13, 2025
డిసెంబర్ 31 కి ఇంకా ఎన్నో రోజులు లేదు. బుల్లితెర రకరకాల ఈవెంట్స్ తో షోస్ లో అలరించడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. అదే "కం టు ఢీ పార్టీ..2026 ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్" పేరుతో ఒక లేటెస్ట్ టీజర్ వచ్చింది. ఇక ఈ ప్రోగ్రాం 31 వ తేదీ రాత్రి 9 .30 కి ప్రసారం కాబోతోంది. ఈ షోకి హోస్ట్ గా సుధీర్ కనిపించాడు. "సుధీర్ గాడి పార్టీ అంటే వినడమే కానీ సూసిందే లేదు కదా..ఇప్పుడు చూపిస్తా అసలు పార్టీ ఏంటో" అంటూ చెప్పాడు సుధీర్. ఈ షోలో ఇంద్రజ, ఆలీ, కావ్య, పండు, జాఫర్, ఆది వంటి వాళ్లంతా వచ్చారు. డాన్స్ లు చేసారు.
"మీ అమ్మకు చెప్పు నీ సంగతి తెలుస్తాయి ఇవ్వాళ" అన్నాడు ఆది. "అమ్మను ఎమన్నా అంటే గనక బాగోదు" అంటూ సుధీర్ వార్నింగ్ ఇచ్చాడు. "ఒక్కసారి నాకు ఊపొచ్చాకా అమ్మ కొడుకులిద్దరినీ ఊపేస్తా" అన్నాడు ఆది. "నీకు ఊపు రావాలేమో నేనెప్పుడూ ఊపు మీదే ఉంటా" అన్నాడు సుధీర్. "పోతారు మొత్తం పోతారు" అని సుధీర్ ఆదిని అన్నాడు. "ఎవరు పోరు మీ అమ్మాకొడుకులిద్దరే బయటకు పోతారంతే" అన్నాడు ఆది. ఇక నెటిజన్స్ ఐతే కామెంట్స్ చేస్తున్నాడు "ఆది - ఇంద్రజ కాంబినేషన్ సూపర్, రష్మీ లేదా పుష్ప, సుధీర్ ఫాన్స్ ఇక్కడ, ఆది ఫాన్స్ ఇక్కడ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.