English | Telugu
Karthika Deepam2 : కావేరికి పిలిచే ఛాన్స్ కూడా ఇవ్వని కాంచన.. కార్తీక్ ఆన్ ఫైర్!
Updated : Dec 13, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -539 లో..... శౌర్య హోమ్ వర్క్ చెయ్యకుండా అల్లరి చేస్తుంది. దాంతో అనసూయ కోప్పడుతుంది. శౌర్య హోమ్ వర్క్ చెయ్యకుండా కాంచన బొమ్మ డ్రాయింగ్ వేస్తుంది. అది అనసూయ చూసి ఇది రాయకుండా ఏం చేస్తుందని శౌర్య వెంట అనసూయ పరుగెడుతుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. అంతలోనే కావేరి వస్తుంది. ఏంటి చిన్నమ్మ ఇలా వచ్చావని కార్తీక్ అడుగుతాడు.
దీప ప్రెగ్నెంట్ కదా అత్తయ్యగా తనకి ఇష్టమైనవి వండి పెట్టాలని కావేరి అంటుంది. అందుకే రేపు ప్రొద్దున మా ఇంటికి టిఫిన్ కి పిలుద్దామని వచ్చానంటూ కావేరి అంటుంది. కాంచనని కూడా పిలవబోతుంటే.. కార్తీక్, దీప వస్తారని కాంచన అంటుంది. సరే అని కావేరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు కాశీ ఇంటికి రాగానే శ్రీధర్ గొడవ పెట్టుకుంటాడు. దాంతో స్వప్న, కాశీ కూడా గొడవపెట్టుకుంటారు. నువ్వు ఒక అసమర్ధత గలవాడివి అని స్వప్న అనగానే కాశీకి కోపం వస్తుంది. అప్పుడే కావేరి వచ్చి.. ఏంటి మీ గొడవ అని కోప్పడుతుంది. నీ భర్తని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోమని కావేరి అనగానే.. వాళ్ళేదో అంటే నువ్వు ఏదో అంటావేంటి స్వప్న మీరు ఇద్దరు లోపలికి వెళ్ళండి అని శ్రీధర్ అంటాడు. నువ్వు వెళ్లిన పని ఏమైందని శ్రీధర్ అడుగగా అక్క తనని పిలిచే అవకాశం ఇవ్వలేదని కావేరి చెప్తుంది.
మరొకవైపు మనతో పాటు అమ్మని కూడా రేపు అక్కడికి తీసుకొని వెళదామని దీపతో కార్తీక్ అంటాడు. అదే విషయం కాంచనతో చెప్పగా రానని అంటుంది. శౌర్య వచ్చి.. తాతయ్య ఇంటికి నానమ్మ భోజనానికి ఎందుకు రావాలని అడుగుతుంది. అలాంటప్పుడు తాతయ్య దగ్గర నానమ్మని వదిలేసి రావాలని శౌర్య అనగానే శౌర్యపై కాంచన కోప్పడుతుంది. నేను మీకు ఏం అడ్డుంటున్నాను.. అన్నీ తల్లి నేర్పిస్తే పిల్ల మాట్లాడుతుందని కాంచన అనగానే దీప తన కాళ్లపై పడుతుంది. అత్తయ్య నేనేం చెప్పలేదని దీప ఏడుస్తుంది. ఆ తర్వాత కార్తీక్ అత్తా కోడళ్ళపై కోప్పడతాడు. నువ్వు రేపు వస్తున్నావా లేదా అని కార్తీక్ అడుగగా.. రానని కాంచన చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.