English | Telugu

Karthika Deepam2 : దీప ప్రెగ్నెంట్.. తండ్రి కాబోతున్న కార్తీక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -523 లో..... స్వప్న, కాశీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదని కార్తీక్ కి డౌట్ వస్తుంది. అసలు ఏమైందని కార్తీక్ అడుగుతాడు. కాశీ నన్ను మోసం చేశాడు అన్నయ్య అని స్వప్న చెప్తుంది. జరిగిందంతా స్వప్న చెప్తుంది. అలా అపార్ధం చేసుకోవద్దని ఇద్దరికి కార్తీక్ నచ్చజెప్పుతాడు. అప్పుడే దాస్ వస్తాడు. స్వప్న, కాశీ ని అక్కడ నుండి పంపిస్తాడు. నాకు వీళ్ళ గురించి టెన్షన్ లేదు.. దీప గురించి టెన్షన్ ఉంది.. ఇంకెన్ని రోజు లు జ్యోత్స్న టార్చర్ భరిస్తావని దాస్ అంటాడు.